Pushpa 2 Bunny Look History : పుష్ప 2 బన్నీ లుక్.. గెటప్ వెనకున్న గంగమ్మ జాతర కథ ఇది-pushpa 2 the rule first look here s history of gangamma talli jatara ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pushpa 2 The Rule First Look Here's History Of Gangamma Talli Jatara

Pushpa 2 Bunny Look History : పుష్ప 2 బన్నీ లుక్.. గెటప్ వెనకున్న గంగమ్మ జాతర కథ ఇది

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 12:00 PM IST

Pushpa Bunny Look : పుష్ప 2 సినిమా గురించి ఇండియా మెుత్తం ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి.. బన్నీ లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదంతా సరే.. ఆ లుక్ వెనక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? తిరుపతిలో జరిగే జాతర గురించి విన్నారా?

పుష్ప 2లో అల్లు అర్జున్
పుష్ప 2లో అల్లు అర్జున్ (twitter)

పుష్ప సినిమా(Pushpa Movie)తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. బాక్సాఫీసును షేక్ చేసిందీ సినిమా. ఇక పుష్ప 2(Pushpa 2) మీద భారీ అంచనాలు పెరిగాయి. దర్శకుడు సుకుమార్ కూడా.. ప్రతీ పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. చిత్తూరు, తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ సినిమా కథ సాగుతోంది. దీంతో స్థానిక కల్చర్ మీద సుకుమార్ ఫోకస్ చేశాడు. తాజాగా బన్నీ లుక్ కూడా అదే చెబుతోంది. స్థానిక గంగమ్మ జాతరలోని సంప్రదాయాన్ని సుక్కు చూపిస్తున్నాడు. బన్నీ గెటప్ కూడా దానికి సంబంధించినదే ఉంది. ఈ గంగమ్మ జాతర గురించి తెలుసుకుందాం..

ప్రతీ ఏటా మే నెలలో గంగమ్మ తల్లి జాతర(Gangamma Thalli Jatara)ను చేస్తారు. దీనిని తాతగట్టు గంగమ్మ జాతర అని కూడా పిలుస్తారు. మే నెల మెుదటి మంగళవారం ప్రారంభమై.. రెండో మంగళవారం జాతర ముగుస్తుంది. మెుదటి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మెుదలవుతుంది.

జాతర చాటింపు జరిగిన తర్వాత.. పొలిమేర దాటొద్దని నియమం. తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు, జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మను వేంకటేశ్వరుడి చెల్లెలిగా భావిస్తారు. అంతేకాదు.. టీటీడీ వారు అమ్మవారికి పట్టు చీర సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు.

తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామ దేవతలు ఉండగా.. వారిలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఆ తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, చీరెలు, పొంగళ్ళు సమర్పిస్తారు. చినగంగమ్మ పెళ్లికానీ యువతి. అప్పట్లో తిరుపతిలో పాలెగాడు.. గంగమ్మను చూసి మోహించి బలవంతం చేయబోతాడట. అప్పుడు గంగమ్మ ఉగ్రరూపంతో పాలెగాడిని సంహరించబోతుంది. పాలెగాడు భయపడి పాయిపోయి దాక్కుంటాడు.

అయితే పాలెగాడిని సంహరించేందుకు.. వివిధ వేషాల్లో(బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి) వెతుకుతుంది. చివరిరోజున దొర వేషంలో వెళ్తుంది. తమ దొర వచ్చాడని పాలెగాడు బయటకు వస్తాడట. అప్పుడు గంగమ్మ విశ్వరూపంతో పాలెగాడిని సంహరిస్తుంది. మరుసటి రోజున మాతంగి వేషంతో పాలెగాడి భార్యను ఓదారుస్తుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించి జాతర చేస్తారు. తాళ్లపాక అన్నమాచార్యులు కూడా గంగమ్మ తల్లిని కీర్తించారు.

తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు చాలా మంది భక్తులు వస్తారు. ఈ జాతర ఏడురోజులు జరుగుతుంది. అందులో పురుషులు ఓ రోజున స్త్రీలాగా రెడీ అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప 2లో అదే వేషం వేసినట్టుగా అర్థమవుతోంది.

WhatsApp channel