Pushpa 2 Update: గుడ్‌న్యూస్.. పుష్ప 2పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేస్తోంది-pushpa 2 update to out on wednesday april 5th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pushpa 2 Update To Out On Wednesday April 5th

Pushpa 2 Update: గుడ్‌న్యూస్.. పుష్ప 2పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేస్తోంది

పుష్ప 2 నుంచి రానున్న కీలకమైన అప్‌డేట్
పుష్ప 2 నుంచి రానున్న కీలకమైన అప్‌డేట్

Pushpa 2 Update: గుడ్‌న్యూస్.. పుష్ప 2పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేస్తోంది. బన్నీ బర్త్ డేకు పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్.. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ను బుధవారం (ఏప్రిల్ 5) చేయనున్నారు.

Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ (పుష్ప 2) మూవీ అప్‌డేట్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమవుతోంది. దీంతో మూవీ అప్‌డేట్ చెప్పాలంటూ ఆ మధ్య అభిమానులు ఓ ఉద్యమమే నడిపారు. అయితే మొత్తానికి ఈ మూవీ నుంచి అధికారికంగా ఓ కీలకమైన అప్‌డేట్ రాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం (ఏప్రిల్ 5) ఉదయం 11:07 గంటలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు పుష్ప 2 మేకర్స్ వెల్లడించారు. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల సీక్వెల్స్ మొదటి పార్ట్ కంటే కూడా సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప ది రూల్ కూడా అలాంటి సంచలనాలే నమోదు చేస్తుందని భావిస్తున్నారు.

ఇక ఈ మూవీ లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఏప్రిల్ 7, ఏప్రిల్ 8వ తేదీల్లో కాన్సెప్ట్ వీడియో, ఫస్ట్ లుక్ వస్తున్నాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో పుష్ప మేకర్స్ వరుస సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్స్ ఏంటన్నవి బుధవారం (ఏప్రిల్ 5) తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ పుష్ప 2లో రష్మిక ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తొలి పార్ట్ కంటే కూడా ఈ సీక్వెల్ ను సుకుమార్ మరింత భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ పైనే అతడు చాలా కాలం పని చేశాడు.

సంబంధిత కథనం