MLA Watching Porn: అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే-viral video appears to show bjp mla watching porn in tripura assembly ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Viral Video Appears To Show Bjp Mla Watching Porn In Tripura Assembly

MLA Watching Porn: అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్
అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్

MLA Watching Porn: త్రిపుర అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు ఒక బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ఆ ఎమ్మెల్యే ఈ పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించారు.

MLA Watching Porn: ఇటీవలే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) అసెంబ్లీలో కూర్చుని తన మొబైల్ ఫోన్ లో బూతు వీడియోలు చూస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

MLA Watching Porn: బీజేపీ సీరియస్

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మొబైల్ ఫోన్ లో తమ పార్టీ ఎమ్మెల్యే అసభ్య వీడియోలు చూస్తుండడంపై బీజేపీ (BJP) సీరియస్ అయింది. ఆ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) కు సమన్లు జారీచేసి, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఆ ఎమ్మెల్యే (BJP MLA)ను సస్పెండ్ చేయలేదు. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నసమయంలో, ఇతర సభ్యులు, స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో, ఆ ప్రొసీడింగ్స్ ను పట్టించుకోకుండా, సీరియస్ గా తన మొబైల్ లో బూతు వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) జాధవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) చూస్తుండడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసెంబ్లీలో జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) వెనుక కూర్చున్న మరో ఎమ్మెల్యే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

MLA Watching Porn: గతంలో కూడా..

2012 లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్నాటక (Karnataka) లోని బీజేపీ (BJP) ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు అసెంబ్లీలో అసభ్య వీడియోలు చూస్తున్న కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతున్న సమయంలో మంత్రులు లక్ష్మణ్ సావడి, సీసీ పాటిల్ లు తమ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తున్న దృశ్యాలు అప్పుడు వైరల్ గా మారాయి. మొదట వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, కొన్నాళ్ల తరువాత మళ్లీ పార్టీలో చేర్చుకుంది.

WhatsApp channel