TTD Alert : తిరుమలలో భారీగా రద్దీ... భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చిన టీటీడీ-ttd alerts devotees of heavy rush at tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Alert : తిరుమలలో భారీగా రద్దీ... భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చిన టీటీడీ

TTD Alert : తిరుమలలో భారీగా రద్దీ... భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చిన టీటీడీ

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 10:19 PM IST

heavy rush at tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. తిరుమలలో భారీగా రద్దీ ఉన్న నేపథ్యంలో… పలు సూచనలు చేసింది.

భక్తులకు టీటీడీ అలర్ట్...
భక్తులకు టీటీడీ అలర్ట్...

Tirumala Latest News: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో... ప్రస్తుతం ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిందని సూచించింది. గుడ్ ఫ్రైడే, రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావటంతో ఇలా వరుసగా మూడురోజు సెలవు దినాలు ఉన్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షలు పూర్తి కావటంతో తిరుమలకు భారీగా పోటేత్తారు. భక్తుల రాకతో తిరువీధులన్నీ రద్దీగా మారాయి.

భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరిలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ గోగర్భం డ్యామ్ వరకు చేరుకుంది. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం పడుతోంది.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీడీపీ సూచించింది.

సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉంది.మరోవైపు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, ఆహారం అందిస్తోంది టీటీడీ. మరోవైపు రద్దీ పరిస్థితిని టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ చూస్తుంటే.. ఈ నెల కూడా రికార్డు ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ గుర్తింపు ద్వారా గదులు కేటాయిస్తున్న టీటీడీ… గదుల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

IPL_Entry_Point