Telangana Jobs : కొలువుల జాతర.. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి ఆనుమతి-telangana government permits to fill 2391 posts in various departments through tspsc mhsrb treirb ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Jobs : కొలువుల జాతర.. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి ఆనుమతి

Telangana Jobs : కొలువుల జాతర.. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి ఆనుమతి

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 06:11 PM IST

Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ, బీసీ గురుకల విద్యాసంస్థ, వైద్య నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణలో కొలువుల జాతర

Telangana Jobs : రాష్ట్రంలో కొలువుల భర్తీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు విభాగాలు, శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి.. నియామక ప్రక్రియ చేపడుతోన్న సర్కార్.. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ, మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబాపూలే గురుకుల‌ విద్యాసంస్థ ద్వారా ఈ ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. బీసీ గురుకులాల్లో 1,499 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో 166.. బీసీ గురుకులాల్లో 141 జూనియర్ అసిస్టెంట్.. సహా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులకు అనుమతి ఇస్తూ... ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్ వారీగా లెక్కలు తేలిన తర్వాత ఆయా పోస్టులకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

బీసీ గురుకులాల్లో అనుమతి ఇచ్చిన 1,499 పోస్టుల్లో.... 480 డిగ్రీ కళాశాల లెక్చరర్లు... 324 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్... 235 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్.. 185 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. సమాచార శాఖలో అనుమతించిన 166 ఖాళీల్లో... అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్.. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్... ఎడిటర్ (ఉర్దు)... ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్.. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్.. పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

త్వరలో గురుకులాల నోటిఫికేషన్..

ఇప్పటికే గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాలతో పాటు వైద్య శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన సర్కార్.. మిగతా విభాగాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే.. త్వరలో.. గురుకులాల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించగా... ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB)... వీటికి మరిన్ని పోస్టులు కలిపి 11, 687 ఖాళీల్లో నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అయ్యింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , సాధారణ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్ లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే ఆయా సొసైటీల నుంచి పూర్తి సమాచారం రావడంలో కొంత ఆలస్యం కావడంతో.. నోటిఫికేషన్ రిలీజ్ కాస్త లేట్ అయింది. సొసైటీల వారీగా ఖాళీలు, అర్హతలు, రిజర్వేషన్ల వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయనుంది. నోటిఫికేషన్ ద్వారా గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనుంది.

IPL_Entry_Point