Nurses Day | కనిపించే దేవుళ్లు డాక్టర్స్ అయితే.. కాపాడే దేవతలు నర్సులు-florence nightingale early life and international nurses day theme and history ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nurses Day | కనిపించే దేవుళ్లు డాక్టర్స్ అయితే.. కాపాడే దేవతలు నర్సులు

Nurses Day | కనిపించే దేవుళ్లు డాక్టర్స్ అయితే.. కాపాడే దేవతలు నర్సులు

HT Telugu Desk HT Telugu
May 12, 2022 11:20 AM IST

ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఏదొక థీమ్​తో నర్సుల ప్రాధన్యతను తెలుపుతూ.. వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కృషి చేస్తున్నారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

International Nurses Day 2022 | రోగుల ప్రాణాలను రక్షించేందుకు కీలకమైన సహకారాన్ని అందిస్తున్న నర్సులను హైలైట్ చేసి.. వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. వైద్యులకు సహాయం చేయడం నుంచి.. ఆసుపత్రుల్లో లేదా ఇంట్లో కోలుకుంటున్న లేదా మరణిస్తున్న రోగులకు చికిత్స చేయడంలో నర్సులు అవసరమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తారు.

నైటింగేల్​ సేవలకు గుర్తుగా..

మే 12వ తేదీ, 1820న జన్మించిన బ్రిటీష్ నర్సు, గణాంకవేత్త ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆధునిక నర్సింగ్ స్థాపకురాలిగా గుర్తింపు పొందారు. టర్కీలో క్రిమియన్ యుద్ధంలో బ్రిటీష్, మిత్రరాజ్యాల సైనికులకు ఫ్లోరెన్స్ కీలకమైన సహాయాన్ని అందించింది. క్రిమియన్ యుద్ధం (1854-1856) సమయంలో, గాయపడిన సైనికులకు సేవ చేయడానికి ఆమె స్వచ్ఛందంగా నర్సుగా నియమించారు. నైటింగేల్ రోగులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి, వేగవంతంగా కోలుకోవడంలో సహాయపడటానికి.. శుభ్రత, సరైన పారిశుద్ధ్య పరిస్థితుల ఆవశ్యకతను నొక్కి చెప్పింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవం, నర్సింగ్, సాంఘిక సంస్కరణలలో ఆమె చేసిన కృషికి గుర్తుగా.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆమె 202వ జయంతి. బ్రిటిష్ నేషనల్ ఆర్మీ మ్యూజియం వెబ్‌సైట్ ప్రకారం ఆమె 'తూర్పులోని హాస్పిటల్స్‌లో మహిళా నర్సుల సూపరింటెండెంట్‌గా' గుర్తింపు పొందారు.

ది లేడీ విత్ ది ల్యాంప్

ప్రస్తుతం టర్కీలోని స్కుడార్‌లో ఉన్న సమయంలోనే ఆమె "ది లేడీ విత్ ది ల్యాంప్"గా గుర్తింపు పొందింది. ఫ్లోరెన్స్ గాయపడిన సైనికుల మంచాల వెంట చేతిలో దీపంతో నడుస్తూ.. వారికి సహాయం అవసరమా లేదా అని తనిఖీ చేసేది. ఇలా ఆమె జీవితాంతం పారిశుధ్యం గురించి, నర్సింగ్ సంస్కరణల కోసం ప్రచారం చేసింది. శిక్షణ పొందిన నర్సులు, మెరుగైన నర్సింగ్ సౌకర్యాల కోసం నిధుల అవసరాన్ని ఆమె ఉన్నతాధికారులకు హైలైట్ చేసింది.

థీమ్ ఏంటంటే..

ఈ సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం థీమ్ 'నర్సెస్: ఎ వాయిస్ టు లీడ్ - నర్సింగ్‌లో పెట్టుబడి పెట్టండి, ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నర్సుల హక్కులను గౌరవించండి.' ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు తమ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ థీమ్ ఫ్లోరెన్స్ చేసిన అదే ఆందోళనలను హైలైట్ చేస్తుంది.

WhatsApp channel