కేజీఎఫ్‌ డైలాగ్‌తో లక్నోకు దిమ్మదిరిగే పంచ్‌ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-rcb counters lsg with kgf movie dialogue after the ipl match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  కేజీఎఫ్‌ డైలాగ్‌తో లక్నోకు దిమ్మదిరిగే పంచ్‌ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కేజీఎఫ్‌ డైలాగ్‌తో లక్నోకు దిమ్మదిరిగే పంచ్‌ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hari Prasad S HT Telugu
Apr 20, 2022 03:28 PM IST

ఐపీఎల్‌లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్ టీమ్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కాస్త ఎక్స్‌ట్రాలు చేసింది. క్రీడాస్ఫూర్తి లేని ఓ ట్వీట్‌ చేయడంతో ఫ్యాన్స్‌ కూడా ఆ టీమ్‌కు క్లాస్‌ పీకారు.

లక్నోను చిత్తు చేసిన ఆర్సీబీ
లక్నోను చిత్తు చేసిన ఆర్సీబీ (PTI)

ముంబై: ఆటల్లో మాటలతో, చేతలతో ప్రత్యర్థిని కవ్వించడం సాధారణమే. ఇది ఒక పరిమితి వరకూ ఉంటే ఎలాంటి నష్టం లేదు. కానీ హద్దులు మీరితేనే అందరితోనూ తిట్లు తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్ పరిస్థితి అదే. మంగళవారం ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ఆ టీమ్‌ అడ్మిన్‌ చేసిన ఓ క్రీడాస్ఫూర్తి లేని ట్వీట్‌పై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. "ఇవాళ్టి మా ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదీ.. ఆర్సీబీ బేటా నీ వల్ల కాదులే!" అంటూ లక్నో టీమ్‌ ఓ ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఏదో ఫ్రెండ్లీగా ఓ మాట అన్నారంటే ఓకే కానీ.. ఇలా 2008 నుంచీ ఐపీఎల్‌లో ఉన్న టీమ్‌ను పట్టుకొని బేటా అంటూ అవమానించడం సరికాదని లక్నో టీమ్‌కు క్లాస్‌ పీకారు. చివరికి ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోవడంతో ఆ టీమ్‌ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఈ ట్వీట్‌ను డిలీట్‌ చేయడం విశేషం.

అయితే ఆర్సీబీ మాత్రం ఊరుకోలేదు. మ్యాచ్‌ తర్వాత లక్నో టీమ్‌కు కేజీఎఫ్‌లోని ఓ డైలాగ్‌తో దిమ్మదిరిగే పంచ్‌ ఇచ్చింది. ఆ సినిమాలో విలన్‌తో హీరో అనే డైలాగ్‌ అది. ఇఫ్‌ యు థింక్‌ యు ఆర్‌ బ్యాడ్‌.. ఐ యామ్‌ యువర్‌ డ్యాడ్‌ అనే డైలాగ్‌ అది. ఈ డైలాగ్‌ జిఫ్‌ను ట్వీట్ చేస్తూ ఓ ఎమోజీని మాత్రం పోస్ట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నోను చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో రెండోస్థానానికి చేరింది.

<p>మ్యాచ్ కు ముందు ఈ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేసిన లక్నో టీమ్</p>
మ్యాచ్ కు ముందు ఈ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేసిన లక్నో టీమ్
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్