తెలుగు న్యూస్  /  National International  /  Lic Ipo Gets Strong Demand From Anchor Investors

LIC IPO | ఆ ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్​.. ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​..!

HT Telugu Desk HT Telugu

02 May 2022, 17:11 IST

  • ఎల్ఐసీ ఐపీఓ కోసం యాంకర్​ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు! యాంకర్​ బుక్​ రెండింతల డిమాండ్​తో ఓవర్​సబ్​స్క్రైబ్​ అయినట్టు సమాచారం. ఈ వారంలో ఐపీఓ ఓపెన్​ కానున్న వేళ.. ఈ వార్తతో ప్రభుత్వానికి గుడ్​ న్యూస్​ అందినట్టే.

ఎల్​ఐసీ ఐపీఓ
ఎల్​ఐసీ ఐపీఓ (MINT_PRINT)

ఎల్​ఐసీ ఐపీఓ

LIC IPO anchor investors list | స్టాక్​ మార్కెట్​ వర్గాలతో పాటు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఎల్​ఐసీ ఐపీఓ.. మరో రెండు రోజుల్లో సబ్​స్క్రిప్షన్​ కోసం ఓపెన్​ కానుంది. దినికి ముందు.. ఎల్​ఐసీలో 100శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి గుడ్​ న్యూస్​ అందింది! ఎల్​ఐసీ ఐపీఓకు యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్​ లభించినట్టు తెలుస్తోంది. యాంకర్​ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన కోటా.. ఓవర్​సబ్​స్క్రైబ్​ అయ్యిందని సమాచారం. మొత్తం మీద యాంకర్​ ఇన్వెస్టర్లకు 732మిలియన్​ షేర్లను రిజర్వ్​ చేయగా.. రెండింత డిమాండ్​ లభించినట్టు బ్యాంకింగ్​ వర్గానికి చెందిన కొందరు వెల్లడించారు.

హై ప్రొఫైల్​తో కూడిన ఇన్ట్సిట్యూషనల్​ ఇన్వెస్టర్లను యాంకర్​ ఇన్వెస్టర్లు అని అంటారు. కాగా.. ఇతర ఇన్వెస్టర్లులాగా కాకుండా.. వీరికి లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. అంటే.. లిస్టింగ్​ అయిన కొన్ని రోజుల వరకు.. వీరు తమ స్టాక్స్​ను అమ్ముకోలేరు. సాధారణంగా.. ఏ ఐపీఓకైనా.. రిటైలర్ల సబ్​స్క్రిషన్​కు కొన్ని రోజుల ముందు.. యాంకర్​ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయిస్తారు. యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందనతో ఐపీఓకు ఉన్న డిమాండ్​ను మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తూ ఉంటాయి.

యాంకర్​ బుక్​లో బడా కంపెనీల పేర్లే ఉన్నట్టు తెలుస్తోంది. నార్వేకు చెందిన నోర్గెస్​ బ్యాంక్​ ఇన్​వెస్ట్​మెంట్​ మేనేజ్​మెంట్​, సింగపూర్​ సావరిన్​ వెల్త్​ ఫండ్​- జీఐసీ వంటి పేర్లు నమోదైనట్టు సమాచారం. అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయంగా ఉన్న హెచ్​డీఎఫ్​సీ మూచ్యువల్​ ఫండ్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, కొటాక్​ సైతం యాంకర్​ ఇన్వెస్టర్స్​గా ఉన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద యాంకర్​ బుక్​లో 20 ఇన్​వెస్టర్ల పేర్లు ఉన్నట్టు వెల్లడించాయి.

ఎల్​ఐసీ ఐపీఓ, సంస్థ పనితీరుపై ఎఫ్​ఐఐల్లో ఆందోళన నెలకొంది. కాగా.. ప్రపంచంలోని పెన్షన్​ ఫండ్స్​ మాత్రం ఐపీఓపై ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది.

గ్రే మార్కెట్​ ప్రీమియం..

LIC IPO GMP | ప్రస్తుతం ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం.. రూ. 75గా ఉంది. గత గురువారం రూ. 20గా ఉన్న ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం.. శుక్రవారానికి రూ .72కు చేరింది. ఇక శనివారం ఎల్​ఐసీ జీఎంపీ రూ. 92కు పెరిగింది.

ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.

ఎల్​ఐసీ ఐపీఓ వివరాలు..

  • LIC IPO details | ప్రైజ్​ బ్యాండ్​:- రూ. 902- రూ. 949
  • సబ్​స్క్రిప్షన్​ డేట్స్​:- మే 4- మే 9
  • పాలసీదారులకు డిస్కౌంట్​:- రూ. 60/షేరు(ఏప్రిల్​ 13కు ముందు పాలసీ తీసుకుని ఉండాలి)
  • ఎల్​ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్​:- రూ. 45/ షేరు
  • లిస్టింగ్​:- 2022 మే 17

ఈ ఐపీఓతో ప్రభుత్వం.. 3.5శాతం వాటాను విక్రయించి రూ. 21వేల కోట్లను సమీకరించాలని సంకల్పించింది.

టాపిక్