తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market | లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. 17,300 మార్కును అందుకున్న నిఫ్టీ

Stock market | లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. 17,300 మార్కును అందుకున్న నిఫ్టీ

HT Telugu Desk HT Telugu

29 April 2022, 9:30 IST

google News
    • దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. నిఫ్టీ 17,300 మార్కును అందుకుంది.
బీఎస్​ఈ సెన్సెక్స్​
బీఎస్​ఈ సెన్సెక్స్​ (REUTERS)

బీఎస్​ఈ సెన్సెక్స్​

అంతర్జాతీయ సానుకూల పవనాల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 234పాయింట్ల లాభంతో 57,756 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 67 పాయింట్లు వృద్ధి చెంది 17,312 వద్ద కొనసాగుతోంది.

గత ట్రేడింగ్​ సెషన్​ను 57,521 వద్ద ముగించిన సెన్సెక్స్​.. శుక్రవారం 57,817 వద్ద ఓపెన్​ అయ్యింది. ఇక గురువారం 17,245 వద్ద ముగిసిన నిఫ్టీ.. ఏకంగా 17,329 వద్ద సెషన్​ను ప్రారంభించింది.

లాభాలు.. నష్టాలు..

సన్​ఫార్మా షేర్లు 3శాతం మేర పెరిగాయి. ఇండస్​ఇండ్​, డా.రెడ్డీస్​, ఎం ఆండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​టీ, కొటాక్​బ్యాంక్​, బజాజ్​ఫిన్​సర్వ్​, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు 1శాతం మేర వృద్ధిచెందాయి.

యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు 3.8శాతం పడ్డాయి. పవర్​గ్రిడ్​, నెస్లే, హెచ్​యూఎల్​, మారుతీ, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఎఫ్​ఐఐలు కొనగోళ్లవైపు..!

కొన్ని రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. భారీ అమ్మకాలపై దృష్టి పెట్టి, స్టాక్​ మార్కెట్ల పతనానికి ఒక కారణంగా మారిన ఎఫ్​ఐఐలు సైతం.. గురువారం కొనుగోళ్లవైపు మొగ్గుచూపారు.

టాపిక్

తదుపరి వ్యాసం