ఎల్ఐసీ ఐపీఓకు లాభాలొస్తాయా? గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది?
28 April 2022, 12:06 IST
- ఎల్ఐసీ ఐపీఓ వివరాలు వచ్చేశాయి. సబ్స్క్రిప్షన్ల కోసం మదుపర్లు నగదును పోగుచేసుకుంటున్నారు. ఇంతకి ఎల్ఐసీ ఐపీఓకు లాభాలొస్తాయా? లేక పేటిఎంలాగే ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ నష్టాల్లో జరుగుతుందా? గ్రే మార్కెట్ ప్రీమియం ఏం సూచిస్తోంది?
ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం
LIC IPO GMP | ఎల్ఐసీ ఐపీఓకు సర్వం సిద్ధమైంది. మే 4- మే 9 మధ్యలో ఎల్ఐసీ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు చెందిన వివరాలన్నీ బయటకు వచ్చేశాయి. ఇప్పుడు ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం(జీఎంపీ)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..
ఎల్ఐసీ ఐపీఓ వివరాలు..
- ప్రైజ్ బ్యాండ్:- రూ. 902- రూ. 949
- సబ్స్క్రిప్షన్ డేట్స్:- మే 4- మే 9
- పాలసీదారులకు డిస్కౌంట్:- రూ. 60/షేరు(ఏప్రిల్ 13కు ముందు పాలసీ తీసుకుని ఉండాలి)
- ఎల్ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్:- రూ. 45/ షేరు
- లిస్టింగ్:- 2022 మే 17
గ్రే మార్కెట్ ప్రీమియం..
LIC IPO grey market premium | ప్రైమరీ మార్కెట్లో ఎల్ఐసీ ఐపీఓ.. మే 17న లిస్ట్ అవుతుంది. కాగా.. సోమవారమే సెంకడరీ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లు ట్రేడింగ్‌కు వచ్చాయి. రూ. 25 ప్రీమియంతో సోమవారం ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. కాగా.. అది బుధవారం రూ. 28కి చెరింది. కానీ.. గురువారం ఎల్ఐసీ ఐపీఓ జీపీఎం రూ. 20కి పడింది.
దీని అర్థం ఏటంటే.. ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్.. రూ. 969 వద్ద అవుతుందని గ్రే మార్కెట్ అంచనా వేస్తోంది. ప్రైజ్ బ్యాండ్(రూ. 902-949) కన్నా ఇది 5శాతం అధికం.
ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్ట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్ అవుతుందా? అని మార్కెట్ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.
గతేడాది వచ్చిన ఐపీఓల్లో చాలా వరకు మంచి గ్రే మార్కెట్ ప్రీమియంతో.. భారీ లాభాల్లో లిస్ట్ అయ్యాయి. కానీ పేటీఎం వంటి సంస్థల గ్రే మార్కెట్ ప్రీమియం నష్టాల్లోనే ఉండగా.. లిస్టింగ్ కూడా అదే విధంగా జరిగింది.
గ్రే మార్కెట్ ప్రిమియం వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఐపీఓకు మంచి డిమాండ్ లభిస్తే.. లిస్టింగ్ లాభాలు ఉంటాయి. డిమాండ్ లేకపోతే నష్టాల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే.. ఓ సంస్థ ఐపీఓకు అప్లై చేయాలా? వద్దా? అని ఆలోచించేందుకు.. గ్రే మార్కెట్ ప్రీమియంను ప్రామాణికంగా చూడవద్దని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తూ ఉంటారు. కంపెనీ ఫండమెంటల్స్, పీ అండ్ ఎల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్. వ్యాపారం వంటివి చూసి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలని చెబుతుంటారు.
ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
LIC IPO date | "ఇండియ బీమా రంగంలో ఎల్ఐసీ అగ్రగామిగా వెలుగుతోంది. ఎల్ఐసీ బ్రాండ్ వాల్యూ చాలా పెద్దది. అదే సమయంలో ఎల్ఐసీకి ప్రస్తుతం ప్రైవేటు ప్లేయర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్నేళ్లుగా.. ఎల్ఐసీ మార్కెట్ షేరు కూడా పడిపోతోంది. కానీ ఎల్ఐసీ బిజినెస్ మోడల్ చాలా బాగుంది. ఇది మంచి ఫండమెంటల్స్ ఉన్న సంస్థ. అందుకే దీర్ఘకాలం కోసం ఎల్ఐసీ ఐపీఓకు అప్లై చేసుకోవడం మంచిది," అని స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్లోని హెడ్ ఆఫ్ రిసెర్చ్ సంతోష్ మీనా వెల్లడించారు.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రం. దీనితో హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి బంధం లేదు. ఏదైనా ఐపీఓలో పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.
టాపిక్