తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic News Latest | ఐపీఓ వేళ కేంద్రం కీలక నిర్ణయం!

LIC news latest | ఐపీఓ వేళ కేంద్రం కీలక నిర్ణయం!

HT Telugu Desk HT Telugu

26 February 2022, 17:34 IST

  • LIC IPO |ఎల్​ఐసీలోని ఎఫ్​డీఐ విధానాలను సులభతరం చేస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 20శాతం పెట్టుబడులను ప్రత్యక్ష మార్గం ద్వారా అనుతించేందుకు అంగీకరించినట్టు సమాచారం. 

ఎల్​ఐసీ
ఎల్​ఐసీ (Hindustan times)

ఎల్​ఐసీ

LIC FDI limit | త్వరలో ఐపీఓకు రానున్న ఎల్​ఐసీలో.. ఎఫ్​డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానాలకు సంబంధించి కీలక సవరణ చేసింది కేంద్రప్రభుత్వం! ప్రత్యక్ష(ఆటోమేటిక్​) విధానాల్లో ఎఫ్​డీఐలు 20శాతం పెట్టుబడులు పెట్టే విధంగా అనుమతించేందుకు కేంద్ర కేబినెట్​ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఎఫ్​డీఐలు సులభంగా ఇన్​వెస్ట్​మెంట్​లు చేసేందుకు సైతం ఎల్​ఐసీ విధానాల్లో కేంద్రం మరికొన్ని మార్పులు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా.. దేశంలో 'ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​'కు అవకాశం మెరుగుపడుతుందని, ఎఫ్​డీఐల రూపంలో నగదు ప్రవాహం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్టు చెప్పాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగ అవకశాలు పెరుగుతాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నాయి.

ప్రస్తుత విధానాల ప్రకారం.. పబ్లిక్​ సెక్టార్​ బ్యాంక్​లలో ఎఫ్​ఐడీఐలకు 20శాతం వరకు అవకాశం ఉన్నా.. అందుకు ప్రభుత్వం అనుమతిని కచ్చితంగా తీసుకోవాలి. కేంద్రం తాజా నిర్ణయంతో ఎఫ్​డీఐలకు పని కాస్త సులభమైంది.

ఎల్​ఐసీ ఐపీఓపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎఫ్​డీఐలు సైతం ఆసక్తి చూపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

5శాతం వాటా…

LIC IPO date | ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈనెల 13న సెబీ వద్ద దాఖలు చేసింది కేంద్రం. మొత్తం 5శాతం వాటాను ఐపీఓలోకి తీసుకొచ్చింది. ఆ విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

మొత్తం మీద 31.6కోట్ల ఈక్విటీ షేర్ల(5శాతం) వాల్యుయేషన్​తో సెబీ వద్దకు వెళ్లింది కేంద్రం. 2021 సెప్టెబర్​ 30 నాటికి ఈ 5శాతం షేర్ల విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

LIC IPO | ఈ బీమా సంస్థకు 66శాతం మార్కెట్​ వాటా ఉంది. మొత్తం మీద 283మిలియన్​ పాలసీలు కంపెనీ వద్ద ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 మిలియన్​ మంది ఏజెంట్లు ఉన్నారు.

వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇటీవలే ఎయిర్​ ఇండియాను టాటాలకు అప్పగించింది. అదే సమయంలో ఎల్​ఐసీ ఐపీఓను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

గతంలో భారీ ఐపీఓలు వస్తున్న సమయంలో.. మార్కెట్లు అనేకమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఐపీఓలో పాల్గొనేందుకు మదుపర్లు భారీ మొత్తంలో డబ్బులు వెనక్కి తీసుకోవడంతో మార్కెట్​లో లిక్విడిటీ కొంతమేర తగ్గిపోయేది.

ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​ అవ్వాలని ప్రభుత్వం ప్రార్థనలు చేస్తోంది. ఈ ప్రార్థనలు ఏమేరకు ఫలిస్తాయనేది మరో నెల రోజుల్లో తెలిసిపోతుంది!

తదుపరి వ్యాసం