తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Ipo | కౌంట్​డౌన్​ షురూ.. సెబీ చేతికి ముసాయిదా పత్రాలు

LIC IPO | కౌంట్​డౌన్​ షురూ.. సెబీ చేతికి ముసాయిదా పత్రాలు

HT Telugu Desk HT Telugu

13 February 2022, 21:37 IST

  • LIP IPO news | దేశప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్​ఐసీ ఐపీఓకు కౌంట్​డౌన్​ మొదలైంది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది కేంద్రం. మొత్తం 5శాతం వాటాను ఐపీఓలోకి తీసుకొచ్చింది. ఆ విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

కౌంట్​డౌన్​ షురూ.. సెబీకి చేతికి ముసాయిదా పత్రాలు
కౌంట్​డౌన్​ షురూ.. సెబీకి చేతికి ముసాయిదా పత్రాలు (hindustan times)

కౌంట్​డౌన్​ షురూ.. సెబీకి చేతికి ముసాయిదా పత్రాలు

LIC IPO date | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ ఎల్​ఐసీ ఐపీఓకు కౌంట్​డౌన్​ మొదలైంది. ఈ బీమా సంస్థ ఐపీఓకు సంబంధించి.. మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ వద్ద ఆదివారం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మార్చ్​ నెలలో ఈ ఐపీఓ మార్కెట్​లోకి వచ్చే అవకాశముంది.

మొత్తం మీద 31.6కోట్ల ఈక్విటీ షేర్ల(5శాతం) వాల్యుయేషన్​తో సెబీ వద్దుకు వెళ్లింది కేంద్రం. 2021 సెప్టెబర్​ 30 నాటికి ఈ 5శాతం షేర్ల విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

LIC IPO | ఈ బీమా సంస్థకు 66శాతం మార్కెట్​ వాటా ఉంది. మొత్తం మీద 283మిలియన్​ పాలసీలు కంపెనీ వద్ద ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 మిలియన్​ మంది ఏజెంట్లు ఉన్నారు.

అయితే.. ఐపీఓలో పాలసీదారులకు, ఉద్యోగులకు ఏవైనా డిస్కౌంట్లు ఉంటాయా? అన్న విషయంపై ప్రభుత్వం దాఖలు చేసిన ముసాయిదా పత్రాల్లో ఎలాంటి స్పష్టత లేదు. అదే సమయంలో.. ఎల్​ఐసీ పూర్తి వాల్యుయేషన్​ను సైతం ప్రభుత్వం చెప్పలేదు.

వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇటీవలే ఎయిర్​ ఇండియాను టాటాలకు అప్పగించింది. అదే సమయంలో ఎల్​ఐసీ ఐపీఓను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఐపీఓ ఎప్పుడెప్పుడు మార్కెట్​లోకి వస్తుందా అని దలాల్​ స్ట్రీట్​, వ్యాపారవేత్తలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.

తదుపరి వ్యాసం