తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Disqualification : 'ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్​ కొట్టివేత..

PM Modi disqualification : 'ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్​ కొట్టివేత..

Sharath Chitturi HT Telugu

29 April 2024, 16:32 IST

  • PM Modi disqualification plea : ప్రధాని మోదీపై అనర్హత వేటు వేయాలని,ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్​ని దిల్లీ హైకోర్టు కొట్టేసింది. మోదీ ప్రసంగాల చుట్టూ నెలకొన్న వివాదం ఇది.

ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్​ కొట్టివేత..
ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్​ కొట్టివేత.. (ANI file)

ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్​ కొట్టివేత..

PM Modi disqualification : 2024 లోక్​సభ ఎన్నికల్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై 6ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్​ని దిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్నికల కమిషన్​.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నందను, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోమని దిల్లీ హైకోర్టు చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

మోదీపై అనర్హత వేటుకు పిటిషన్​ కొట్టివేత..

దేవుడు, ప్రార్థనా మందిరాన్ని ఉపయోగించుకుని.. ఉత్తర్​ ప్రదేశ్​ పిలిబిట్​లో ప్రధాని మోదీ ప్రసంగాలు చేశారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్​, న్యాయవాది ఆనంద్​ ఎస్​ జొంధాలే. మోదీ.. 6ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొకుండా ఆదేశాలివ్వాలని కోరారు.

"ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని మీరే ముందుగా ఊహించేసుకున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇలా చెయ్​, అలా చెయ్​ అని ఈసీకి మేము చెప్పలేము. మీరు ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లారు. ఈ ఫిర్యాదుపై ఈసీ సొంతంగా నిర్ణయం తీసుకోగలదు," అని జస్టిస్​ సచిన్​ దత్తాతో కూడిన సింగిల్​ జడ్జ్​ బెంచ్​ పేర్కొంది.

Delhi high court on PM Modi : ఫిర్యాదును ఈసీ పరిశీలిస్తుందని, తగిన చర్యలు తీసుకుంటుందని.. ఎన్నికల సంఘం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది సిద్ధాంత్​ కుమార్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

ప్రధాని మోదీ.. తన ప్రచారాలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని.. కాంగ్రెస్​ పార్టీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. రాజస్థాన్​ సభలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని పేర్కొంది.

"తల్లులు, సోదరీమణుల బంగారం తీసుకుని.. ఇతరులకు పంచుతామని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఉంది. వారు ఎవరికి పంచుతారు? దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని గతంలో మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వం చెప్పింది," అని ఇటీవల ఓ ర్యాలీలో కామెంట్​ చేశారు మోదీ.

"ముస్లింలకు దేశ ఆస్తులపై మొదటి హక్కు ఉంటుందని గత పాలనలో కాంగ్రెస్​ చెప్పింది. అంటే.. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో చెప్పినట్టు, ఈ ఆస్తులను ఎవరికి పంచుతారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే పంచుతారు. చొరబాటుదారులకు పంచుతారు. మీ కష్టార్జితం.. చొరబాటుదారుల చేతుల్లోకి వెళ్లాలా? మీరు ఒప్పుకుంటారా?" అని మోదీ అన్నారు.

PM Modi disqualification plea Delhi high court : వాస్తవానికి.. 1951 రిప్రెజెంటేషన్​ ఆఫ్​ పీపుల్స్​ యాక్ట్​ ప్రకారం.. దేవుడు, దైవం, ప్రార్థనా మందిరాలు, మతాలతో ఓటును అడగడం నిషేధం. ఇది నేరపూరితం.

ఇక.. మోదీ వ్యాఖ్యాలను పరిశీలించిన ఎన్నికల సంఘం.. స్టార్​ క్యాంపైనర్లు.. వారి స్థాయికి తగ్గట్టు ప్రసంగాలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సూచించింది.

2024 లోక్​సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. 3వ దశ మే 7న జరగనుంది. మొత్తం 7 దశల పోలింగ్​ ప్రక్రియ ముగిసిన తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

తదుపరి వ్యాసం