Gutha Amith: కాంగ్రెస్‌ గూటికి చేరిన గుత్తా అమిత్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించి సిఎం రేవంత్ రెడ్డి-gutta amit reddy joined the congress party was invited by cm revanth reddy with a scarf ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gutha Amith: కాంగ్రెస్‌ గూటికి చేరిన గుత్తా అమిత్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించి సిఎం రేవంత్ రెడ్డి

Gutha Amith: కాంగ్రెస్‌ గూటికి చేరిన గుత్తా అమిత్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించి సిఎం రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Apr 29, 2024 12:23 PM IST

Gutha Amith: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయల్లో వలసలు కొనసాగుతున్నాయి. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

గుత్తా అమిత్‌ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి
గుత్తా అమిత్‌ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి

Gutha Amith: ఊహించినట్టే గుత్తా అమిత్‌ రెడ్డి Gutha Amith Reddy కాంగ్రెస్‌ Congress గూటికి చేరిపోయారు. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న డ్రామాకు ముగింపు పలికారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి విముఖత చూపిన గుత్తా అమిత్ రెడ్డి చివరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

తెలంగాణ శాసన మండలి తనయుడు గుత్తా అమిత్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా మంత్రి Komatireddy కోమటిరెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ Deepadas munshi లు ఆహ్వానించారు. వారితో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి CM RevanthReddy ఇంటికి వచ్చిన అమిత్‌ రెడ్డిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తాతో పాటు నల్గొండకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో అమిత్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్‌ గూటికి వెళుతుందని ప్రచారం జరుగుతున్న వేళ గుత్తా అమిత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అమిత్‌రెడ్డి ఇంటికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి వెళ్లారు. ఈ మేరకు వారు అమిత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిని అమిత్‌రెడ్డికి టిక్కెట్ దక్కలేదు. కాంగ్రెస్ చేరి అదే స్థానం నుంచి బరిలో నిలవాలని భావించినా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడంతో టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల అహంకారంతోనే అధికారంతో పాటు ప్రజలకు దూరమైందని గుత్తా కొద్దిరోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో అమిత్‌రెడ్డితో పాటు సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారా, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా అనేది తేలాల్సి ఉంది.

గుత్తా అమిత్ వెనకగుడు ఎందుకు..?

నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి Gutha Amith Reddy రెండు నెలల క్రితమే పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోఆయన తన రాజకీయ అరంగేట్రానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో మునుగోడు టికెట్ అడిగినా దక్కలేదు. ఆ తర్వాత 2023 డిసెంబరులో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లోనూ మరో మారు టికెట్ కోసం ప్రయత్నించారు.

BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వడంతో అవకాశం రాలేదు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకుని ఆ మేర పనిచేస్తూ పోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను,Electionsలో కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. దీంతో జిల్లా పార్టీలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నా.. గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తన తనయుడికి నల్గొండ ఎంపీ టికెట్ కోసం అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు చేశారు.

లోక్ సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పార్టీ సమీక్ష సమావేశాల్లో నల్గొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అయిదుగురు మాజీ ఎమ్మెల్యేలు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుత్తా అమిత్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోమని పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. ఈ దశలో కనీసం భువనగిరి ఎంపీ స్థానం నుంచైనా టికెట్ కావాలని కోరారు.

నల్గొండ.. లేదంటే భువనగిరి అయినా పర్వాలేదని చెప్పుకున్నారు. ఈ లోగా.. ఏం జరిగిందో తెలియదు కానీ, పార్టీ గెలిచే అవకాశం లేని చోట, డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేసి ఓడిపోవడం ఎందుకన్న ఆలోచనతో అసలు పోటీ చేయడం కన్నా ఎన్నికలకు దూరంగా ఉండడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

తెరవెనుక ఏం జరిగింది..?

నల్గొండ, లేదంటే భువనగిరి కావాలని కోరినా.. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, మాజీ ఎమ్మెల్యేలు అంతా తమ ఓటమికి గుత్తా సుఖేందర్ రెడ్డి కారణమని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తన అనుచరగణాన్ని మొత్తం కాంగ్రెస్ లోకి పంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కంటే.. దూరంగా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చి, ఆ విషయాన్ని అధినాయకత్వానికి కూడా చేరవేశారని తెలుస్తోంది.

గుత్తా అమిత్ గత ఫిబ్రవరిలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను ఏ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్దంగా లేనని, తనకు టికెట్ అవసరం లేదని, తన పేరును పరిశీలించొద్దని చెప్పారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

Whats_app_banner

సంబంధిత కథనం