Lok Sabha election : మొబైల్ నెంబర్‌తో మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ని ఇలా తెలుసుకోండి..
How to find polling station with mobile number : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఇంకొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథయ్యంలో.. ఒక్క మొబైల్ నెంబర్‌తో మీ పోలింగ్ బూత్ వివరాలను ఇలా తెలుసుకోండి..
2024 Lok Sabha elections : దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా.. త్వరలోనే ఎన్నికల హడావుడి జోరందుకోనుంది. మే 13న.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణలో కూడా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఓటింగ్ కోసం కేటాయించిన పోలింగ్ బూత్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈపీఐసీ సంఖ్య కీలకం..
సాధారణంగా ఓటర్ ఐడీ కార్డు అని పిలిచే ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు (ఈపీఐసీ).. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) జారీ చేసిన ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫా-న్యూమెరిక్ కోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ కోడ్ మీ ఓటరు రిజిస్ట్రేషన్ స్టేటస్‌ని రుజువుగా పనిచేస్తుంది. ఇది.. మీ ఓటర్ ఐడీ కార్డు ముందు భాగంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ప్రత్యామ్నాయంగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ) నుంచి కూడా దీనిని పొందవచ్చు.
ఈపీఐసీ నెంబర్ని ఆన్లైన్లో పొందేందుకు.. ఎన్వీఎస్పీ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లండి. సర్వీస్ సెక్షన్‌ని చూడండి. సెర్చ్ బై డీటెల్స్ లేదా సెర్చ్ బై మొబైల్ ఆపన్షన్స్ మీకు కనిపిస్తాయి.
How to find polling station for election 2024 : సెర్చ్ బై డీటెల్స్ ఆప్షన్ని ఎంచుకుంటే.. మీ బేసిక్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ కొడితే.. మీ ఈపీఐసీ కోడ్ కనిపిస్తుంది. లేదా.. సెర్చ్ బై మొబైల్ ఆప్షన్ని ఎంజుకుంట.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇవవాలి. సెండ్ ఓటీపీ బటన్ ప్రెస్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే.. మీ ఈపీఐసీ నెంబర్ కనిపిస్తుంది.
ఈపీఐసీ నెంబర్ వచ్చిన తర్వాత..electoralsearch.eci.gov. వెబ్సైట్లోకి వెళ్లండి. మీ ఈపీఐసీ కోడ్‌తో పాటు రాష్ట్రం పేరు, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీ బోలింగ్ బూత్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Find my polling station : ఇలా.. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం మీ పోలింగ్ బూత్ వివరాలను ముందే తెలుసుకుని.. ప్లాన్ చేసుకోండి. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లేడప్పుడు.. మీ ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోకండి.
2024 Andra Pradesh Assembly elections : 2024 లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. ఫలితాలు.. జూన్ 4న వెలువడనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలు కూడా అప్పుడే బయటకి వస్తాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్లో అందుబాటులో ఉంది! లేటెస్ట్ న్యూస్, అప్టేడ్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం