IOCL recruitment 2023 : ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!
15 May 2023, 13:47 IST
- IOCL recruitment 2023 : ఐఓసీఎల్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్ తుది గడవు, పరీక్ష వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
IOCL recruitment 2023 : ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి గుడ్ న్యూస్. 65 నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్). అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లికేషన్ ప్రక్రియ తుది గడవు మే 30. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను సంస్థ అధికారిక వెబ్సైట్ iocl.com లో సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2023...
65 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. వీటిల్లో 54 పోస్టులు జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-4 (ప్రొడక్షన్), 7 జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్- 4 (పీ అండ్ యూ), 4 ఇంజినీరింగ్ అసిస్టెంట్- 4 (పీ అండ్ యూ- ఓ అండ్ ఎం) పోస్టులు ఉన్నాయి.
IOCL recruitment 2023 apply online : ఐఓసీఎల్ రిక్రూట్మెంట్లో అప్లికేషన్ వేయాలని భావిస్తున్న అభ్యర్థుల వయస్సు 18ఏళ్లు- 26ఏళ్ల (ఏప్రిల్ 30 నాటికి) మధ్యలో ఉండాలి.
ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- ముందుగా.. ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- అక్కడ ఉన్న కెరీర్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
IOCL recruitment 2023 notification : స్టెప్ 3:- అప్లికేషన్ ఫార్మ్‌ను నింపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను వెల్లడించండి.
స్టెప్ 4:- సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయండి.
స్టెప్ 5:- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 6:- అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మీట్ చేయండి. సంబంధిత కాపీని ప్రిటౌంట్ తీసుకోండి.
అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మీట్ చేసిన తర్వాత.. అభ్యర్థులు సంబంధిత పత్రాలను జూన్ 10లోపు సంబంధిత అధికారులకు ఆర్డినరీ పోస్ట్ ద్వారా అందించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్..
- నోటిఫికేషన్:- మే 1 20023
- అప్లికేషన్ దాఖలుకు చివరి గడువు- మే 30 2023
- రాత పరీక్ష నిర్వహణ- జూన్ 11 2023
- రాత పరీక్ష ఫలితాలు- జూన్ 27 (అంచనా)
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2023..
SSC CHSL 2023 Notification : కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ సెక్రటరీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి గ్రూప్-సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది. సుమారు 1600 పోస్టుల కోసం ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి, 10+2) విద్యార్హతగా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ssc.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జూన్ 8 ఆఖరు గడువుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.