DU Faculty Recruitment: ఢిల్లీ యూనివర్సిటీలో ఫాకల్టీ రిక్రూట్ మెంట్
DU Faculty Recruitment: ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (University of Delhi) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
DU Faculty Recruitment: ఢిల్లీ లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (University of Delhi) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మోతీలాల్ నెహ్రూ కాలేజీలో మొత్తం 88 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లను ఈనోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
DU Faculty Recruitment: ఆన్ లైన్ లో అప్లికేషన్..
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మోతీలాల్ నెహ్రూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ colrec.uod.ac.in. ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ, అర్హత, అనుభవం, సెలెక్షన్ ప్రాసెస్ తదితర వివరాల కోసం colrec.uod.ac.in. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించండి.
DU Faculty Recruitment: వేకెన్సీ వివరాలు..
మొత్తం 88 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లను ఈనోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో కెమిస్ట్రీ (Chemistry) 4, కామర్స్ (Commerce) 18, ఇంగ్లీష్ (English) 8, హిందీ (Hindi) 7, హిస్టరీ (History) 8, గణితం (Mathematics) 8, ఫిజిక్స్ (Physics) 12, పొలిటికల్ సైన్స్ (Political Science) 10, సంస్కృతం (Sanskrit) 6, ఎకనామిక్స్ (Economics) 4, కంప్యూటర్ సైన్స్ (Computer Science) 1, ఈవీఎస్ (EVS) 2 పోస్ట్ లున్నాయి. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో పీజీ చేసి ఉండాలి. దాంతో పాటు యూజీసీ లేదా సీఎస్ఐఆర్ నిర్వహించే నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.