తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Recruitment 2023: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 76 టీచింగ్ ఉద్యోగాలు.. ముఖ్య తేదీలివే

HCU Recruitment 2023: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 76 టీచింగ్ ఉద్యోగాలు.. ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu

10 May 2023, 16:42 IST

    • Hyderabad Central University: ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలు, అర్హతలు, నియామక విధానం వంటి పలు వివరాలను పేర్కొంది.
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

Hyderabad Central University Recruitment 2023: ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ. పలు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 76 పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సైన్స్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, అనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, మెడికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్), హ్యూమానిటిస్ (ఇంగ్లీష్, ఫిలాసఫీ,హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీ,), ఎకానమిక్స్ (ఎకనామిక్స్), సోషల్ సైన్సెస్( పొలిటికల్ సైన్స్, అంత్రాపాలజీ, హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్( కమ్యూనికేషన్, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్), మ్యానేజ్ మెంట్ స్డడీస్ లోని పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

ముఖ్య వివరాలు :

భర్తీ చేసే పోస్టులు - ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియట్ ప్రొఫెసర్

మొత్తం పోస్టులు - 76

భర్తీ చేసే పోస్తులు - సైన్స్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, అనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, మెడికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్), హ్యూమానిటిస్ (ఇంగ్లీష్, ఫిలాసఫీ,హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీ,), ఎకానమిక్స్ (ఎకనామిక్స్, హిస్టరీ), సోషల్ సైన్సెస్( పొలిటికల్ సైన్స్, అంత్రాపాలజీ, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్( కమ్యూనికేషన్, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్), మ్యానేజ్ మెంట్ స్డడీస్.

నోటిఫికేషన్ ప్రకటన - 03- 05 -2023

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 31 -05- 2023.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ -09- 06- 2023

దరఖాస్తు చేసుకున్న హార్ట్ కాపీని కింద ఇచ్చిన అడ్రస్ కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

DEPUTY REGISTRAR (RECRUITMENT)

RECRUITMENT CELL

ROOM No:221, (First Floor), ADMINISTRATION BUILDING

UNIVERSITY OF HYDERABAD

PROF. C R RAO ROAD

GACHIBOWLI, HYDERABAD – 500 046, INDIA.

అర్హతలు - పీహెచ్డీ ఉండాలి, యూజీసీ నెట్ అర్హత తప్పనిసరి. ప్రొఫెసర్ పోస్టులకు పది సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. అకడమిక్స్ లో మంచి ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రియారిటీ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నెట్ తప్పనిసరి. వీరు మాస్టర్స్ లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతం సాధించి ఉండాలి. రెగ్యూలర్ విధానంలోనే పీహెచ్డీ చేసి ఉండాల్సి ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ అభ్యర్థులు కూడా నెట్ లో అర్హత సాధించాలి. మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం స్కోర్ సాధించాలి. టీచింగ్ అనుభవం కూడా తప్పనిసరి.

జీతాలు - పోస్టులను అనుసరించి ఇస్తారు. 57వేల నుంచి 2 లక్షలకు పైగా చెల్లిస్తారు.

వెబ్ సైట్ లింక్ - https://uohyd.ac.in/careers-uoh/ (ఈ లింక్ లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది)

కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను పేర్కొన్నారు. రిక్రూట్ చేసే సబ్జెక్ట్ వివరాలు, అర్హతలు, దరఖాస్తుల విధానం గురించి వివరించారు.

తదుపరి వ్యాసం