తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crpf Recruitment 2023: 9వేలకుపైగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసేందుకు మరో రెండు రోజులే గడువు

CRPF Recruitment 2023: 9వేలకుపైగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసేందుకు మరో రెండు రోజులే గడువు

30 April 2023, 16:20 IST

    • CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల దరఖాస్తుకు మరో రెండు రోజులే (మే 2) గడువు ఉంది. వివరాలివే.
CRPF Recruitment 2023: 9వేలకుపైగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు
CRPF Recruitment 2023: 9వేలకుపైగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

CRPF Recruitment 2023: 9వేలకుపైగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టులకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు గడువు ముగింపు తేదీ దగ్గరపడుతోంది. అప్లికేషన్ సమర్పించేందుకు మరో రెండు రోజులు (మే 2) మాత్రమే గడువు ఉంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force - CRPF)లో 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల పోస్టుల సంఖ్యను 9,360కు సీఆర్‌పీఎఫ్ పెంచింది. ముందుగా దరఖాస్తులకు తుది గడువు ఏప్రిల్ 25 తేదీన ఉండగా.. ఆ లాస్ట్ డేట్‍ను మే 2వ తేదీ (May 2) వరకు సీఆర్‌పీఎఫ్ ఇటీవల పొడిగించింది. దీంతో, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పురుష, మహిళా అభ్యర్థులు మే 2లోగా అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్టును బట్టి పదో తరగతి/ఐటీఐ విద్యార్హతగా ఉన్నాయి. వివరాలివే..

దరఖాస్తు వివరాలు

CRPF Recruitment 2023: rect.crpf.gov.in వెబ్‍సైట్‍లో అభ్యర్థులు ఈ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2వ తేదీ అప్లికేషన్ల సమర్పణకు తుది గడువుగా ఉంది. మార్చి 27న ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా 9,360 పోస్టులు ఉన్నాయి.

CRPF Recruitment 2023: వయోపరిమితి: కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మిగిలిన విభాగాల్లో కానిస్టేబుల్ (గార్డెనర్, క్లోబర్, కార్పెంటర్, పెయింటర్, కుక్, వాటర్ కారియర్, వాషర్ మ్యాన్, బార్బర్, ఎలక్ట్రిషన్ సహా మరిన్ని పోస్టులు) పోస్టులకు వయో వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 26 ఏళ్ల వయసు లోపు ఉండాలి. ఎస్‍సీ, ఎస్‍టీలకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఓబీసీలు, ఎక్స్-సర్వీస్‍మెన్‍కు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. పోస్టులను బట్టి వయో పరిమితి వివరాలు నోటిఫికేషన్‍లో పూర్తిగా ఉన్నాయి. నోటిఫికేషన్ rect.crpf.gov.in వెబ్‍సైట్‍లో ఉంది.

CRPF Recruitment 2023: పరీక్ష ఫీజు: ఈ పోస్టులకు దరఖాస్తు పరీక్ష ఫీజు రూ.100గాఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ, మహిళలకు (అన్ని కేటగిరీలు), ఎక్స్-సర్వీస్‍మెన్‍కు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

CRPF Recruitment 2023: విద్యార్హత: పోస్టులను బట్టి పదో తరగతి,ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఏ పోస్టులకు విద్యార్హత ఎలా ఉందో నోటిఫికేషన్‍లో పూర్తిగా ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‍ను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఎంపిక ప్రక్రియ

CRPF Recruitment 2023: కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT) పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టును బట్టి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి ట్రేడ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు ఉంటుంది. వీటిలో అర్హత సాధించిన వారిని ఉద్యోగాలకు సీఆర్‌పీఎఫ్ ఎంపిక చేస్తుంది.

ముఖ్యమైన తేదీలు ఇలా..

CRPF Recruitment 2023: ఈ పోస్టులకు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసేందుకు మే 2వ తేదీ ఆఖరు గడువుగా ఉంది. CBT పరీక్షకు చెందిన అడ్మిట్ కార్డులు జూన్ 20 నుంచి జూన్ 25వ తేదీ మధ్య వెల్లడవుతాయి. జూలై 1వ తేదీ నుంచి జూలై 13వ తేదీ మధ్య సీబీటీ పరీక్ష జరిగే అవకాశం ఉంది.

దరఖాస్తు ఇలా..

  • CRPF Recruitment 2023: ముందుగా crpf.gov.in వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.
  • అనంతరం రిక్రూట్‍మెంట్ పోర్టల్ ఆఫ్ సీఆర్‌పీఎఫ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అక్కడ టెక్నికల్& ట్రేడ్స్‌మెన్ పోస్టులకు అప్లయ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. అక్కడే లాగిన్ అయి వివరాలను సమర్పించి దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేయాలి.
  • చివరగా ఫీజు చెల్లించాలి.
  • దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఆ అప్లికేషన్‍ను డౌన్‍లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

తదుపరి వ్యాసం