Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్
04 May 2024, 21:02 IST
Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తుండగా తనపై లైంగిక దాడికి ప్రయత్నం జరిగిందని 16 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో తనపై దాడి జరిగిందని ఆ 16 ఏళ్ల బాలుడు తెలిపాడు. ఈ పోస్ట్ ను ఢిల్లీ పోలీసులు సుమోటో గా తీసుకుని కేసు నమోదు చేశారు.
ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నం
Sexual assault in Delhi Metro: 16 ఏళ్ల బాలుడు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు.సమయ్ పూర్ బద్లీ వైపు వెళ్తున్న మెట్రో ట్రైన్ ను రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో ఎక్కిన తర్వాత తోటి ప్రయాణికుడు తనపై లైంగిక దాడి (Sexual assault in Delhi Metro)కి ప్రయత్నించాడని భవ్య అనే ఆ బాలుడు వివరించాడు. ఈ ఘటనతో తాను చాలా భయపడిపోయానని, వణికిపోయానని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
ఢిల్లీ పోలీసులకు ట్యాగ్
‘‘ఢిల్లీ మెట్రోలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో నాపై లైంగిక దాడి జరిగింది. నేను 16 ఏళ్ల బాలుడిని. నేను మెట్రోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. నేను మొదట ఈ ఘటనపై రెడ్డిట్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశాను. అయితే, ఎక్స్ లో పోస్ట్ చేయమని, ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేయమని పలువురు సూచించడంతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను’’ అని ఆ బాలుడు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
సెక్యూరిటీ గార్డ్ సాయం
మెట్రోలో తనకు జరిగిన భయానక అనుభవాన్ని భవ్య వరుస ట్వీట్స్ తో పంచుకున్నాడు. మరో మెట్రో రైలులోకి సురక్షితంగా ఎక్కడానికి సహాయం చేసిన మెట్రో స్టేషన్ గార్డు గురించి మాట్లాడాడు. దాడి తర్వాత తాను మొద్దుబారిపోయానని, తన స్టాప్ కోసం ఎదురు చూస్తున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. ‘మెట్రోలో ప్రయాణిస్తుండగా, ఆ వ్యక్తి తనపై మూడుసార్లు దాడి చేశాడని, మూడోసారి ఆ యువకుడు తన వెంట్రుకలను పట్టుకుని ఫొటో తీశాడని చెప్పాడు. "నేను భయపడ్డాను మరియు వణికిపోయాను’ అని భవ్య వివరించాడు. ఈ పోస్ట్ కు 14 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రజల నుంచి భారీగా కామెంట్లు కూడా వచ్చాయి. కొందరు ఆ యువకుడికి మద్దతు తెలపగా, మరికొందరు తల్లిదండ్రులకు చెప్పమని చెప్పారు. ఈ పోస్ట్ పై స్పందించిన ఢిల్లీ పోలీసులు (Delhi police) ‘దయచేసి మీ కాంటాక్ట్ వివరాలను డీఎం చేయండి. తద్వారా మేము మిమ్మల్ని సంప్రదించగలం’ అని రాశారు.