Hyderabad Crime News : కూకట్ పల్లిలో దారుణం - మహిళపై లైంగిక దాడి, ఆపై హత్య..?
Hyderabad Crime News : హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే సదరు మహిళకు తీవ్రమైన రక్తస్రావం కావటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad Crime News : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కామాంధుల ఘాతుకానికి ఓ మహిళ బలి అయింది. ఇద్దరు అగంతకులు లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావంతో సదరు మహిళ అక్కడే మరణించింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.....కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని విష్ణు ప్రియ లడ్జ్ సమీపంలోని ఏ ఆర్ పైప్ వర్క్స్ సెలర్ లో ఓ మహిళ మృతి దేహం ఉందనే సమాచారం అందటంతో కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాస్ రావు, సీఐ కృష్ణమోహన్ లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్ళారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 - 5 గంటల మధ్య వైన్ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా.....ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు ఒకరు చేతులు,మరొకరు కాళ్ళు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏ ఆర్ పైప్ వర్క్స్ సెల్లార్ కు లాకెళ్లి ఆమెపై లైంగిక దాడికి దిగినట్లు పోలిసులు తెలిపారు. నిందితులు అత్యాచారం చేసిన తరువాత తిరిగి అదే బైక్ పై కూకట్ పల్లి వైపు వెళ్ళినట్టుగా పోలిసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.అక్కడ ఉన్న సెల్లార్ చాలా లోతుగా ఉండడంతో రోడ్డుపై నుంచి చూసినా.....గట్టిగా కేకలు వేసినా ఎవరికి వినిపించలేదని పోలిసులు అంటున్నారు.
బలవంతంగా లాక్కెళ్లి.....
ప్రాణాలు కోల్పోయిన మహిళా వయసు 32 నుంచి 38 ఏళ్ళ మధ్య ఉంటుందని… తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. మూసాపేట్ లో ఎక్కువగా సంచరించే సదరు మహిళా......విష్ణు ప్రియ లొడ్జ్ సమీపంలోని ఓ బైక్ షో రూమ్ లో 2019 నుంచి స్వీపర్ గా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేసేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెకు మద్యం తాగే అలవాటు కూడా ఉందని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో పక్కనే ఉన్న వైన్ షాప్ లో మద్యం తాగి రాత్రి వరకు అక్కడే ఉండి, మూసా పేట్ లోని చిత్తరమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో నిద్రించేదని స్థానికులు పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో మహిళా ఆత్మహత్య.....
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన పొగల రాయ మల్లమ్మ పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువు దగ్గర తన అవసరాల నిమిత్తం మల్లమ అప్పు చేసిందని..,అప్పు తీర్చమని పలు మార్లు వేధించడంతో మహిళా ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.....ఆదివారం రాత్రి మరణించిందని ఆమె అల్లుడు శ్రీనివాస్ వెల్లడించారు. అప్పు ఇచ్చిన సదరు వ్యక్తి తరుచూ మల్లమ్మను వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడంతో అవమానానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని అయన పోలీసులకు వివరించారు.