Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం-innova hits bike in anantapuram and travelled 18km with dead body on car top ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం

Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం

Sarath chandra.B HT Telugu
Apr 15, 2024 07:50 AM IST

Road Terror: అనంతపురం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమయాదం జరిగింది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో, బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి కారు మీద పడ్డాడు. మృతదేహంతోనే ఆ కారు 18కి.మీలు ప్రయాణించింది.

కారు పై భాగంలో  యువకుడి మృతదేహం
కారు పై భాగంలో యువకుడి మృతదేహం

Road Terror: అనంతపురం Anantapuram జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఇన్నొవా Innova డ్రైవర్ మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ ధాటికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్ర రక్తస్రావడంతో ప్రాణాలు విడిచాడు. అయినా ఆ విషయాన్ని కారు డ్రైవర్ Car Driver గుర్తించలేదు.

ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన తర్వాత డ్రైవర్‌ ప్రమాదం జరిగిందని తెలిసినా అక్కడి నుంచి పారిపోయేందుకు వేగంగా కారు నడుపుతూ ముందుకు వెళ్లిపోయాడు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇన్నొవా వాహనంపై యువకుడి మృతదేహంతోనే 18కి.మీ దూరం ప్రయాణించింది.

ఈ దారుణ ప్రమాదం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. కారుపై యువకుడు పడి ఉండటాన్ని గుర్తించిన ఇతరులు వాహనాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం వెలుగు చూసింది.

అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి ట్రాక్టర్‌ మెకానిక్‌‌గా పనిచేస్తున్నాడు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని పి.సిద్దరాం పురానికి చెందిన యువతిని వివాహం చేసుకొని అనంతపురంలో స్థిరపడ్డాడు.

ఆదివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనులపై అత్తిగారి ఊరైన పి.సిద్దరాంపురం వెళ్లి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అనంతపురంకు తిరుగు ప్రయాణమయ్యారు. వై.కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. ద్విచక్రవాహనాన్ని నేరుగా ఢీకొంది. ఈ ఘటనలో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడ్డాడు. ఆ విషయం గమనించని డ్రైవర్‌ కారుతో వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళ్లిపోయాడు. దాదాపు 18 కి.మీ మృతదేహంతో కారుపై ప్రయాణించాడు.

బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై ఓ వ్యక్తి పడి ఉండటాన్ని ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి కారును అడ్డుకున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తుండగానే డ్రైవర్‌ కారును వదిలి పారిపోయాడు. బెంగళూరు రిజిస్ట్రేషన్‌తో కారు ఉన్నట్టు గుర్తించారు. స్థానికులు అడ్డుకున్న సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కూడేరు మండలం చోళ సముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామికి ఆత్మకూరు మండలం సిద్ధ రామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ట్రాక్టర్‌ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం వీధిన పడింది.

ప్రమాదానికి జరిగిన తర్వాత డ్రైవర్‌ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహనాన్ని స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం గురించి తెలిసింది.

కారును రోడ్డు పక్కన ఆపి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. KA 02D9425 రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ఇన్నోవా వాహనం ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ఒక్కడే వాహనంలో ఉన్నాడని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం