Delhi metro to allow carry alcohol: ఢిల్లీ మెట్రోలో ఇక ఆల్కహాల్ తీసుకువెళ్లొచ్చు
ఢిల్లీ మెట్రోలో ఆల్కహాల్ ను క్యారీ చేయడానికి అనుమతించారు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఒక్కో వ్యక్తి రెండు సీల్డ్ బాటిల్స్ ఆల్కహాల్ ను ఢిల్లీ మెట్రోలో తీసుకువెళ్లవచ్చు.
ఢిల్లీ మెట్రోలో ఆల్కహాల్ ను క్యారీ చేయడానికి అనుమతించారు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఒక్కో వ్యక్తి రెండు సీల్డ్ బాటిల్స్ ఆల్కహాల్ ను ఢిల్లీ మెట్రోలో తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాగితే మాత్రం ఒప్పుకోం..
ఢిల్లీ మెట్రోలో ఒక్కో వ్యక్తి రెండు సీల్డ్ బాటిల్స్ ను క్యారీ చేయవచ్చని, కానీ, మెట్రో లో ఆల్కహాల్ సేవించకూడదని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో ఆల్కహాల్ సేవించడం పై ఉన్న నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటివరకు ఏర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో లైన్ ను మినహాయిస్తే.. మిగతా అన్ని లైన్స్ లో ఆల్కహాల్ ను తీసుకువెళ్లడాన్ని నిషేధించారు. తాజాగా, ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. మెట్రోలో ఆల్కహాల్ సేవించడమే కాకుండా, మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించడాన్ని కూడా నిషేధించినట్లు డీఎంఆర్సీ స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే ప్రయాణికులపై చట్టప్రకారం తగిన చర్యలుంటాయని వెల్లడించింది.