HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

HT Telugu Desk HT Telugu

17 May 2024, 19:27 IST

  • యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువును ఎన్టీఏ మరోసారి పొడిగించింది. మొదట ఈ గడువు మే 11వ తేదీ వరకు ఉండగా, గతంలో మే 15 వరకు పొడిగించింది. తాజాగా, యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు అప్లై చేసుకునే గడువును 2024 మే 19 వరకు పొడిగించింది. విద్యార్థులు ugcnet.nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

 యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం, మే 19వ తేదీ వరకు పొడిగించింది. యూజీసీ-నెట్ జూన్ 2024కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు యూజీసీ ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ద్వారా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు 2024 మే 15వరకు ఉండేది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా మే 20, 2024 రాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ విండో మే 21న ఓపెన్ అయి, 2024 మే 23న ముగుస్తుంది.

విద్యార్థులకు సూచన

ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వారి స్వంత నంబర్ అయి ఉండాలని, లేదా తల్లిదండ్రులు / సంరక్షకులది మాత్రమే అయి ఉండాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఎందుకంటే యూజీసీ నెట్ 2024 కి సంబంధించిన అప్ డేట్స్ / సమాచారం / కమ్యూనికేషన్ ఆ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మాత్రమే పంపిస్తామని ఎన్టీఏ తెలిపింది.

యూజీసీ నెట్ జూన్ 2024: అర్హత ప్రమాణాలు

హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ లలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించిన జనరల్/ అన్ రిజర్వ్డ్/ జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. నాన్ క్రీమీలేయర్/షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ)/షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ)/దివ్యాంగులు(పీడబ్ల్యూడీ)/థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు యూజీసీ నెట్ రాయడానికి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

యూజీసీ నెట్ జూన్ 2024: పరీక్ష ఫీజు

యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,150. జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.325 గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపునకు చివరి రోజు అంటే మే 20, 2024 రాత్రి 11.50 గంటలోపు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

యూజీసీ నెట్ జూన్ 2024: వయోపరిమితి

యూజీసీ నెట్ ప్రొఫెసర్ షిప్ పరీక్షకు హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితి లేదు. అయితే, జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) పొందడానికి పరీక్ష ముగిసిన నెల మొదటి రోజున అంటే 01.06.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-ఎన్సీఎల్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

యూజీసీ నెట్ జూన్ 2024: ఇలా అప్లై చేయండి

యూజీసీ నెట్ జూన్ 2024 కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్ట్స్ ఫాలో కావాలి.

  • యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in. ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న యూజీసీ నెట్ జూన్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • "new candidate register here" పై క్లిక్ చేయండి.
  • రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకే ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
  • పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ ను ఏర్పాటు చేసుకోండి.
  • అప్లికేషన్ నెంబరును నోట్ చేసుకోండి.
  • అప్లికేషన్ నెంబరుతో లాగిన్ అవ్వండి.
  • అవసరమైన వివరాలను అందించండి.
  • అవసరమైన డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  • ధృవీకరణ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.

యూజీసీ నెట్ జూన్ 2024: పరీక్ష తేదీ

యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను జూన్ 16, 2024న నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు). పరీక్షను ఓఎంఆర్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్స్ మధ్య విరామం ఉండదు.

హెల్ప్ లైన్ నంబర్స్

యూజీసీ నెట్ జూన్ 2024కు దరఖాస్తు చేయడంలో ఏ అభ్యర్థికైనా ఇబ్బంది ఎదురైతే 011 - 40759000 /011 - 69227700 లకు కాల్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.in ఐడీకి ఇ-మెయిల్ చేయవచ్చు. తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు యూజీసీ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లైన www.nta.ac.in https://ugcnet.nta.ac.in/ లను సందర్శించాలి.

తదుపరి వ్యాసం