తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Phd Notification 2023 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ Phd నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

HCU Phd Notification 2023 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ Phd నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu

29 April 2023, 15:54 IST

google News
    • Hyderabad Central University Latest News: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ లో ప్రవేశాలు కల్పించనుంది.
సెంట్రల్‌ వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్‌ వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్‌ వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల

Hyderabad Central University Admissions 2023: పీహెచ్ డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అర్హతలు, సబ్జెక్టులు, రుసుం, దరఖాస్తుల చివరి తేదీలను పేర్కొంది. ఆయా వివరాలను చూస్తే.....

వర్శిటీ - సెంట్రల్ వర్శిటీ హైదరాబాద్

అర్హతలు - 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ - రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. JRF అర్హత పొందిన అభ్యర్థులకు పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తులు - మే 01, 2023

ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 25 -05 -2023.

హాల్ టికెట్లు డౌన్లోడ్ - 10 -06 - 2023

పరీక్ష ఎంట్రెన్స్ తేదీ - 17 - 06- 2023 నుంచి 08 -06 -2023.

అర్హత గల అభ్యర్థులు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులు, హాల్ టికెట్లు, పరీక్షల షెడ్యూల్, ఇంటర్వూల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

BRAOU Phd admissions: మరోవైపు పీహెచ్డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. ఇప్పటికే యూజీ, పీజీ కోర్సుతో పాటు డిప్లోమా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పీహెచ్డీ కోర్సుల్లోనూ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో కోరింది. 2022- 23 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ప్రవేశాలుగా పేర్కొంది.

ముఖ్య వివరాలు:

ప్రవేశాలు - పీహెచ్డీ

వర్శిటీ - అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్

అందుబాటులో ఉన్న కోర్సులు - ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ సైన్స్‌‌.

అర్హత పరీక్ష - మే 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.

అర్హతలు - పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది.(నెట్/సెట్ వంటివి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది)

ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.

అర్హత పరీక్ష తర్వాత ఇంటర్వూ కూడా ఉంటుంది.

పీహెచ్డీ అర్హత పరీక్ష సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్, ఫీజు - ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.1,000, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

చివరి తేదీ - చెల్లింపునకు మే 8న చివరి తేదీ

ఫైన్ తో చివరి తేదీ - మే 12వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. (రూ. 500)

ఎగ్జామ్ కేంద్రాలు - కేవలం హైదరాబాద్ లోనే ఉంటుంది.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అధికారిక వెబ్ సైట్ - www.braouonline.in

వివరాలు కోసం సంప్రదించాల్సిన నెంబర్ - 1800 599 0101(Controller of Examinations 040-23541376, 23680240)

తదుపరి వ్యాసం