SSC CHSL 2023: ఇంటర్ అర్హతతో 1600 ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలు-ssc chsl 2023 notification released applications registration open apply on ssc nic in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ssc Chsl 2023 Notification Released Applications Registration Open Apply On Ssc Nic In

SSC CHSL 2023: ఇంటర్ అర్హతతో 1600 ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 11, 2023 03:55 PM IST

SSC CHSL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్‍ విడుదలైంది. సుమారు 1600 ఖాళీలను ఎస్ఎస్‍సీ భర్తీ చేయనుంది.

SSC CHSL 2023: ఇంటర్ అర్హతతో 1600 ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలు
SSC CHSL 2023: ఇంటర్ అర్హతతో 1600 ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలు

SSC CHSL 2023 Notification: కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ (CHSL - 10+2) 2023 నోటిఫికేషన్‍ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission - SSC) విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ సెక్రటరీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి గ్రూప్-సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‍ఎస్‍సీ భర్తీ చేయనుంది. సుమారు 1600 పోస్టుల కోసం ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి, 10+2) విద్యార్హతగా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ssc.nic.in వెబ్‍సైట్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జూన్ 8 ఆఖరు గడువుగా ఉంది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ల ప్రారంభం: మే 9
  • అప్లికేషన్లకు తుది గడువు: జూన్ 8
  • ఆన్‍లైన్‍లో ఫీజు చెల్లించేందుకు తుది గడువు: జూన్ 10
  • దరఖాస్తులో తప్పుల సవరణ తేదీలు: జూన్ 14, 15
  • టైర్-1 పరీక్ష: ఆగస్టు, 2023

ఎస్ఎస్‍సీ సీహెచ్ఎస్ఎల్ 2023 పోస్టులకు పోటీ పడాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 8వ తేదీ రాత్రి 11 గంటలలోపు ssc.nic.in వెబ్‍సైట్‍లో ఆన్‍లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హత, వయోపరిమితి

SSC CHSL 2023 Notification: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన వారు ఎస్ఎస్‍సీ సీహెచ్ఎస్ఎల్ 2023కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎస్‍సీలు, ఎస్‍టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితి మినహాయింపు ఉంటుంది. అన్ని అర్హతలు తగిన విధంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‍ను అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ssc.nic.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్ ఉంటుంది.

ఎస్ఎస్‍సీ సీహెచ్ఎస్ఎల్ 2023కు దరఖాస్తు ఫీజు రూ.100గా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రాసెస్ ఇలా..

ఎస్‍ఎస్‍సీ సీహెచ్ఎస్ఎల్ 2023 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) విధానంలో టైర్-1, టైర్-2 పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ (టైపింగ్/కంప్యూటర్) ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఎస్‍ఎస్‍సీ.

దరఖాస్తు చేసుకోండిలా..

  • ముందుగా అధికారిక వెబ్‍సైట్ ssc.nic.in లోకి వెళ్లండి.
  • హోమ్ పేజీలో అప్లయ్ ఆప్షన్‍పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత CHSL ఆప్షన్‍పై క్లిక్ చేయండి.
  • అక్కడ SSC CHSL 2023 అప్లయ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
  • అవసమైన అన్ని వివరాలను సమర్పించాలి. స్కాన్డ్ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్‌ను అప్‍లేడ్ చేయాలి.
  • అప్లికేషన్‍లో అడిగిన డీలైట్స్ అన్నీ సరిగా ఎంటర్ చేయాలి.
  • చివరగా ప్రివ్యూ చూసుకొని అన్నీ సరిగా ఉన్నాయనుకుంటే సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయాలి.
  • డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్‍బ్యాంకింగ్, యూపీఐల్లో ఏ విధానంలో అయినా ఫీజు చెల్లించవచ్చు.
  • అప్లికేషన్ పూర్తయ్యాక డౌన్‍లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకోవాలి.

IPL_Entry_Point