తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Elections 2022: 211 'Crorepati' In Fray, 79 Candidates From Bjp

Gujarat elections 2022 : ఎన్నికల బరిలో ‘కోటీశ్వరులు’.. బీజేపీలోనే ఎక్కువ!

25 November 2022, 12:06 IST

    • Gujarat elections 2022 : గుజరాత్​ ఎన్నికల తొలి దశ పోలింగ్​లో చాలా మంది కోటీశ్వరులు బరిలో దిగారు. వీరిలో చాలా మంది బీజేపీకి చెందినవారే ఉన్నారు!
ఎన్నికల బరిలో ‘కోటీశ్వరులు’.. బీజేపీలోనే ఎక్కువ!
ఎన్నికల బరిలో ‘కోటీశ్వరులు’.. బీజేపీలోనే ఎక్కువ! (BJP Gujarat Twitter)

ఎన్నికల బరిలో ‘కోటీశ్వరులు’.. బీజేపీలోనే ఎక్కువ!

Gujarat elections 2022 : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్​కు రంగం సిద్ధమవుతోంది. పార్టీల ప్రచారాలు చివరి దశకు చేరుకున్నారు. ఇక అభ్యర్థులు.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'కోటీశ్వరుల' జాబితా బయటకొచ్చింది. ఈ లిస్ట్​లో బీజేపీ టాప్​లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

కమలదళం టాప్​..

ఏడీఆర్​ (అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) నివేదిక ప్రకారం.. తొలి దశలో 89 సీట్లకు.. మొత్తం 711మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 211మంది అభ్యర్థులు కోటీశ్వరులు! వీరిలో.. ఒక్క బీజేపీ నుంచే 79మంది కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Gujarat elections BJP : మొత్తం మీద చూసుకుంటే..  గుజరాత్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 27శాతం మంది అభ్యర్థుల దగ్గర రూ. 1కోటి కన్నా ఎక్కువ విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. తొలి దశలో ఉన్న మొత్తం సీట్లల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 79 అంటే.. 89శాతం మంది అభ్యర్థుల ఆస్తులు రూ. 1కోటి కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్​లో 65(73శాతం), ఆమ్​ ఆద్మీ పార్టీలో 33మంది (38శాతం) అభ్యర్థుల వద్ద రూ. 1కోటి కన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి.

ఏడీఆర్​ నివేదిక ప్రకారం.. రాజ్​కోట్​ సౌత్​ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్​పై పోటీ చేస్తున్న రమేశ్​ టియాలాకు అత్యధికంగా రూ. 175కోట్ల ఆస్తులు ఉన్నాయి. రాజ్​కోట్​ ఈస్ట్​ నుంచి కాంగ్రెస్​ టికెట్​పై బరిలో దిగిన ఇద్రనీల రాజ్​గురూ.. ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇంద్రనీల్​ వద్ద రూ. 162కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. మూడో స్థానంలో.. రూ 130కోట్ల ఆస్తులతో.. మానవదార్​ సీటు నుంచి బీజేపీ తరఫున బరిలో దిగిన జవహర్​ చావ్డ నిలిచారు.

Gujarat elections congress : ఇది ఇలా ఉండగా.. రాజ్​కోట్​ వెస్ట్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా.. తన ఆస్తుల విలువ 'సున్నా' అని అఫిడవిట్​లో పేర్కొన్నారు.

ఇక క్రికెటర్​ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజాకు బీజేపీ టికెట్​ లభించిన విషయం తెలిసిందే. ఆమె.. జామ్​నగర్​ నార్త్​ నుంచి పోటీ చేస్తున్నారు. 2021-22లో ఆమె ఆదాయం రూ. 18కోట్లుగా ప్రకటించారు.

Gujarat elections crorepatis : ఇతరుల విషయానికొస్తే.. 73మంది అభ్యర్థులు.. ఆస్తుల విలువను రూ. 5కోట్లు కన్నా ఎక్కువగా ప్రకటించారు. రూ. 2కోట్లు- రూ. 5కోట్ల మధ్య 77మంది ఉన్నారు. మరో 125 మంది.. రూ. 50లక్షలు- 2కోట్ల మధ్య ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. రూ. 10లక్షలు- రూ. 50లక్షల మధ్యలో ఆస్తుల విలువ ఉన్నట్టు మరో 170మంది అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఇక రూ. 10లక్షల కన్నా తక్కువ ఆస్తులు ఉన్నాయని.. 343మంది వివరించారు.

పార్టీల పరంగా చూసుకుంటే.. గుజరాత్​ ఎన్నికల తొలి దశ పోలింగ్​లో.. బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ. 13.40కోట్లుగా ఉంది. కాంగ్రెస్​కు అది రూ. 8.38కోట్లుగా, ఆప్​నకు రూ. 1.99కోట్లుగా ఉంది.

ఏడీఆర్​ నివేదిక ప్రకారం.. 2017 గుజరాత్​ ఎన్నికల తొలి దశ పోలింగ్​లో.. 923 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో.. 198మంది (21శాతం) కోటీశ్వరులు.

క్వాలిఫికేషన్​..

ఇక క్వాలిఫికేషన్​ విషయానికొస్తే.. తొలి దశ పోలింగ్​లో నిలిచిన అభ్యర్థుల్లో 62శాతం మంది 5-12 క్లాసులు చదువుకున్నారు. 185మంది.. గ్రాడ్జ్యువేట్లు, 21మందికి డిప్లమా ఉంది. మొత్తం మీద 57మంది చదువుకున్న వారు ఉన్నారు. 37మంది నిరక్షరాసులు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు.

గుజరాత్​లో డిసెంబర్​ 1,5 తేదీల్లో పోలింగ్​ జరగనుంది. ఫలితాలు 8న వెలువడనున్నాయి. కోటీశ్వరుల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.