తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur News: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

HT Telugu Desk HT Telugu

27 April 2024, 15:01 IST

  • Manipur violence: మణిపూర్ లో కుకీ మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో 128 బెటాలియన్ కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్లు దాడి చేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

మణిపూర్ లో సీఆర్పీఎఫ్ శిబిరంపై కుకీ మిలిటెంట్ల దాడి
మణిపూర్ లో సీఆర్పీఎఫ్ శిబిరంపై కుకీ మిలిటెంట్ల దాడి (ANI Pic Service)

మణిపూర్ లో సీఆర్పీఎఫ్ శిబిరంపై కుకీ మిలిటెంట్ల దాడి

Manipur violence: మణిపూర్లోని నరన్సేన ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కుకి మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2.15 గంటల వరకు సీఆర్పీఎఫ్ జవాన్లపై కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని మణిపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లు మణిపూర్ లోని రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఉన్న నరన్సేన ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ కు చెందినవారు.

ట్రెండింగ్ వార్తలు

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

కొండ పై నుంచి కాల్పులు..

సీఆర్పీఎఫ్ శిబిరం లక్ష్యంగా కుకీ మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ క్యాంప్ పక్కనే ఉన్న కొండపై నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమైన వర్షం 2.15 గంటల వరకు కొనసాగింది. మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ క్యాంప్ పై బాంబులు విసిరారని, అందులో ఒకటి సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ ఔట్ పోస్టులో పేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

సీఎం బీరేన్ ఖండన

సీఆర్పీఎఫ్ జవాన్లపై కుకీ మిలిటెంట్లు జరిపిన దాడిని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు రాత్రింబవళ్లు అహర్నిశలు శ్రమిస్తున్న అంకితభావం కలిగిన భద్రతా సిబ్బందిపై ఇలాంటి చర్యలు పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారి త్యాగం వృథా కాదని వ్యాఖ్యానించారు.

మెయితీ, కుకీల మధ్య ఘర్షణలు

గత ఏడాది మే నుంచి మణిపూర్ లో ఇంఫాల్ లోయకు చెందిన మెయితీలు, పక్కనే ఉన్న కొండ ప్రాంతానికి చెందిన కుకీల మధ్య జరిగిన ఘర్షణల్లో (Manipur violence) 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గత వారం మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 2పై ఉన్న వంతెన ఐఈడీ పేలుడులో పాక్షికంగా ధ్వంసమైంది. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే ఐఈడీ పేలుడు సంభవించింది.