సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024లో 169 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జిడి రిక్రూట్మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ 2024 జనవరి 16న ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ కోటా 2024 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు recruitment.crpf.gov.in సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు ఉదయం 9 గంటలకు లింక్ ఓపెన్ అవుతుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2024. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 169 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుకు వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024: దరఖాస్తు విధానం
- recruitment.crpf.gov.in సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్‌మిట్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరచండి.
స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
వీటికి రేపు చివరి తేదీ
కాగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ (గ్రేడ్-II) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరకుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 16. ఆసక్తి గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఈసీఐఎల్ మొత్తం 1100 కాంట్రాక్ట్ (గ్రేడ్ II) జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం (ITI+ అప్రెంటిస్‌షిప్ తర్వాత) కలిగి ఉండాలి.