తెలుగు న్యూస్  /  National International  /  'No Train, No Votes,' Navsari's 18 Villages Call For Gujarat Assembly Elections Boycott

Gujarat assembly elections : ‘ట్రైన్​ లేకపోతే.. ఓటు లేదు’- 18 గ్రామాల ప్రజలు నిరసన!

13 November 2022, 13:49 IST

  • Gujarat assembly elections boycott : గుజరాత్​లో 18 గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. తమ ప్రాంతంలో ఆగాల్సిన రైలు ఆగడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని ప్రజలు అంటున్నారు. అందుకే ఎన్నికలను, ఎన్నికల ప్రచారాలను బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పారు.

‘ట్రైన్​ లేకపోతే.. ఓటు లేదు’- 18 గ్రామాల ప్రజలు నిరసన!
‘ట్రైన్​ లేకపోతే.. ఓటు లేదు’- 18 గ్రామాల ప్రజలు నిరసన!

‘ట్రైన్​ లేకపోతే.. ఓటు లేదు’- 18 గ్రామాల ప్రజలు నిరసన!

Gujarat assembly elections Navsari : గుజరాత్​లో ఎన్నికల హడావుడి తీవ్రస్థాయిలో ఉంది. ఎన్నికల ప్రచారాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. గెలుపు మాదంటే.. మాదే అని పార్టీలన్నీ ధీమాగా చెబుతున్నాయి. వీటన్నిటి మధ్య.. నవసారి నుంచి ఓ వార్త బయటకొచ్చింది. అక్కడి 18 గ్రామాల్లోని ప్రజలు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రచారాలకు కూడా ఎవరూ రావొద్దని అల్టిమేటం ఇచ్చారు. కారణం ఏంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

ఎన్నికల బహిష్కరణ.. ఎందుకు?

నవసారి నియోజకవర్గంలో అంచెలి అనే గ్రామం ఉంది. అంచెలి రైల్వేస్టేషన్​లో 1966 నుంచి ఒకటే ప్యాసింజర్​ రైలు ఆగుతోంది. చుట్టుపక్కన 18 గ్రామాల ప్రజలు.. ఉద్యోగాలు, చదువుల కోసం ఈ ప్యాసింజర్​ రైలు ఎక్కి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు. 

కొవిడ్​ సంక్షోభంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. కొవిడ్​ కారణంగా రైల్వే సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. ఆ తర్వాత దశలవారీగా పునరుద్ధరించింది. అంచెలిలో ఆగాల్సిన ప్యాసింజర్​ రైలు కూడా పట్టాలెక్కింది. కానీ ఈసారి.. ఆ రైలు అంచెలి రైల్వే స్టేషన్​లో ఆగడం మానేసింది! ప్రజలు ఒకసారి చూశారు, రెండుసార్లు చూశారు.. కానీ రైలు మాత్రం ఆగలేదు. అసలే కొవిడ్​ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న వారు.. ఈ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు తమను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Gujarat assembly elections Ancheli : 18గ్రామాల ప్రజలు ఈ విషయంపై అధికారులను సంప్రదించారు. రైలును అంచెలి రైల్వేస్టేషన్​లో ఆపాలని విజ్ఞప్తి చేశారు. కానీ పరిస్థితులు మారలేదు.

ఈ పరిణామాల మధ్య అంచెలితో పాటు 17 గ్రామాల ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్​ను పరిష్కరించకపోతే.. ఈ దఫా గుజరాత్​ ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. రాజకీయ నేతలు ప్రచారాలకు వస్తే తీవ్ర పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పక్షాన్ని కూడా గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వమని తేల్చేశారు.

ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్​ వద్ద బ్యానర్లు వెలిశాయి. 'రైలు లేకపోతే ఓటు లేదు. బీజేపీ లేదా ఇతర పార్టీలేవీ ప్రచారాల కోసం ఇక్కడికి రాకూడదు. మా డిమాండ్లను నెరవర్చలేదు. అందుకే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాము,' అని ఆ బ్యానర్లలో రాసి ఉంది.

Ancheli railway station : "మాకు చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రైలు కేటాయించాలని మేము అడగడం లేదు. ఉన్న రైలును స్టేషన్​లో ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా.. స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అందుకే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. వాళ్లు ఈవీఎంలను పంపిస్తే.. ఓట్లు వేయకుండా తిరిగి ఇచ్చేస్తాము," అని గ్రామస్థుడు తెలిపాడు.

182 స్థానాలున్న గుజరాత్​ అసెంబ్లీకి డిసెంబర్​ 1,5వ తేదీల్లో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడనున్నాయి.