తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Assembly Elections And Wedding Season To Coincide With Poll Dates

Gujarat Assembly Elections : ఇటు ఎన్నికలు.. అటు పెళ్లిళ్లు- గుజరాతీలు ఓట్లేస్తారా?

08 November 2022, 11:28 IST

  • Gujarat Assembly Elections 2022 : గుజరాత్​లో ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్​ ఒకేసారి వచ్చాయి. పెళ్లిళ్ల హడావుడిలో ఉండే ప్రజలు.. ఎన్నికల్లో ఓట్లేస్తారా? అన్న భయం రాజకీయ నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇటు ఎన్నికలు.. అటు పెళ్లిళ్లు- గుజరాతీలు ఓట్లేస్తారా?
ఇటు ఎన్నికలు.. అటు పెళ్లిళ్లు- గుజరాతీలు ఓట్లేస్తారా? (PTI/file)

ఇటు ఎన్నికలు.. అటు పెళ్లిళ్లు- గుజరాతీలు ఓట్లేస్తారా?

Gujarat Assembly Elections 2022 : గుజరాత్​లో ఎన్నికల వేడి తారస్థాయిలో ఉంది. ప్రచారాలు, నినాదాలు, హామీలతో గుజరాత్​ అంతా హీటెక్కింది. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈసారి గెలుపు తమదంటే.. తమదే అని అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. అయితే.. వీటన్నింటి మధ్య.. గుజరాత్​ నేతల్లో ఓ విషయంపై ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోంది. అదే.. త్వరలో ప్రారంభం కానున్న 'పెళ్లిళ్ల సీజన్​'! సరిగ్గా పెళ్లిళ్ల సీజన్​లో ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రజలు అసలు పోలింగ్​ బూత్​లకు వెళ్లి ఓట్లేస్తారా? ఓటింగ్​ శాతం తగ్గిపోతే పరిస్థితేంటి? అన్న సందేహాలు వారిని భయపెడుతున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

పెళ్లిళ్ల సీజన్​లో ఎన్నికలు.. మరి ఓట్లు..!

కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్ల పాటు ఆంక్షల మధ్యే పెళ్లిళ్ల సీజన్​ జరిగింది. కానీ ఈసారి ఆంక్షలేవీ లేవు. ఫలితంగా ప్రజలు పెళ్లిళ్లకు భారీ ఎత్తున ప్లాన్​లు చేస్తున్నారు.

Gujarat Elections 2022 : పండితుల ప్రకారం.. గుజరాత్​లో నవంబర్​ 22 నుంచి పెళ్లిళ్ల హడావుడి మొదలవుతుంది. ఈ నెల 28,29, డిసెంబర్​ 2,4, 8 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో ఆయా రోజుల్లో పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతాయి. ప్రజలు సొంతూళ్లకు, లేదా ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.

నవంబర్​ 22 నుంచి డిసెంబర్​ 16 మధ్యలో వందలాది పెళ్లిళ్లు ఇప్పటికే ఫిక్స్​ అయిపోయాయి.

"ఈ పెళ్లిళ్ల సీజన్​లో చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్లే వేసుకున్నారు. కొవిడ్​ ఆంక్షలు లేకపోవడంతో ఈసారి కళ్యాణ మండపాలు కళకళలాడిపోతాయి," అని వెడ్డింగ్​ ప్లానర్​ ఆనంద్​ థాక్రేర్​ తెలిపారు.

సరిగ్గా ఇదే సమయంలో డిసెంబర్​ 1,5 తేదీల్లో గుజరాత్​లో ఎన్నికలు జరగనున్నాయి. పెళ్లిళ్లతో బిజీగా ఉండే ప్రజలు.. పోలింగ్​ బూత్​కి వెళ్లి ఓట్లు వేస్తారా? అని రాజకీయ నేతల్లో భయం మొదలైంది.

'రండి.. ఓట్లేయండి..'

Gujarat Wedding season : ఇదే విషయంపై గుజరాత్​ కాంగ్రెస్​ ప్రతినిధి మనీష్​ దోషి మాట్లాడారు.

"ఎలక్షన్​ కోసం పెళ్లిళ్లను ఎవరు పోస్ట్​పోన్​ చేసుకోరు. ఆ సమయంలో ప్రజలు బిజీగా ఉంటారన్న మాట నిజమే. కానీ ఆ మధ్యలో వచ్చి ఓట్లు వేసే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని మేము ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాము. ప్రజాస్వామ్య పండుగలో పాలుపొంచుకోవాలని పిలుపునిస్తాము," అని దోషి స్పష్టం చేశారు.

బీజేపీపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న దోషి.. వారిని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అందుకోసమైనా సరే.. పెళ్లిళ్లు, ఎంగేజ్​మెంట్​లను పక్కనపెట్టి మరీ వచ్చి ఓట్లు వేస్తారని అన్నారు.

Gujarat Election Schedule : ఈ విషయంపై స్పందించిన గుజరాత్​ ఆప్​ ప్రతినిధి కరణ్​ బారోట్​.. "మంచి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఓటర్లేదు. అందుకే.. తమ ప్రియతమ నేతల కోసం ప్రజలు పోలీంగ్​ బూత్​లకు వెళ్లి ఓట్లు వేయాలి," అని అన్నారు.

గుజరాత్​లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. డిసెంబర్​ 1న 89స్థానాల్లో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 5న మిగిలిన 93 సీట్లకు ఓటింగ్​ జరగనుంది. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడతాయి.