Elections: ఆ గ్రామంలో ఓటు వేయకుంటే ఫైన్.. ప్రచారానికి పార్టీలకు నో ఎంట్రీ-political parties banned from campaigning in this gujarat village fine rule for not voting locals ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Political Parties Banned From Campaigning In This Gujarat Village Fine Rule For Not Voting Locals

Elections: ఆ గ్రామంలో ఓటు వేయకుంటే ఫైన్.. ప్రచారానికి పార్టీలకు నో ఎంట్రీ

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2022 06:54 AM IST

Gujarat Elections: గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల కోసం ప్రత్యేకమైన నిబంధనలను విధించుకుంది. ప్రచారం చేసేందుకు రాజకీయ పార్టీలకు ఆ గ్రామంలో అనుమతి ఉండదు.

రాజ్ సమాధియాలా గ్రామం (Photo: ANI)
రాజ్ సమాధియాలా గ్రామం (Photo: ANI) (ANI)

Gujarat Elections 2022: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ఆ ప్రాంతాల్లో హడావుడి మామూలుగా ఉండదు. ప్రచారం హోరెత్తుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో సందడి అధికంగా ఉంటుంది. నాయకుల పర్యటనలు, సభలతో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే ఓ గ్రామంలో మాత్రం ఇదంతా ఉండదు. ఎన్నికలు వచ్చినా ఆ ఊరిలో రాజకీయ పార్టీలు ప్రచారం చేయలేవు. ఎందుకంటే అక్కడి ప్రజలు పెట్టుకున్న నిబంధనల్లో అదొకటి. గుజరాత్‍లోని రాజ్‍కోట్ జిల్లా రాజ్ సమాధియాలా (Raj Samadhiyala) గ్రామ ప్రజలు.. పొలిటికల్ డ్రామాలకు దూరంగా ఉంటారు. ప్రచారం కోసం రాజకీయ పార్టీలను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వరు. అందుకే ప్రస్తుతం గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నా.. ఈ ఊరిలో మాత్రం అంతా ప్రశాంతం. అలాగే ఓటు హక్కు ఉన్న గ్రామస్థులు ఎవరైనా ఓటేయకపోతే ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ప్రచారానికి నో

Gujarat Election: రాజ్‍కోట్‍ (Rajkot)కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ రాజ్ సమాధియాలా గ్రామం ఉంది. ఏ ఎన్నికలు ఉన్నా ఈ గ్రామంలో రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదు. ఈ గ్రామస్థులందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. విలేజ్ డెవలప్‍మెంట్ కమిటీ (VDC) పేరుతో బృందంగా ఏర్పడి ఈ నిబంధనలను గ్రామంలో పెట్టుకున్నారు.

సుమారు 100శాతం పోలింగ్

ఎన్నికలు ఉన్న ప్రతీసారి ఈ గ్రామంలో దాదాపు 100 శాతం పోలింగ్ నమోదవుతుంది. ఓటుహక్కు ఉండి ఎవరైనా ఓటు వేయకపోతే వీడీసీ.. వారికి రూ.51 జరిమానా విధిస్తుంది. ప్రచార ప్రభావం లేకుండా.. ప్రజలు ఇష్టమైన పార్టీకి ఓటు వేయవచ్చు. ఈ గ్రామ సర్పంచ్ కూడా అందరి అంగీకారంతోనే ఎన్నికయ్యారు.

పోలింగ్ కొద్దిరోజుల ముందు కమిటీ

రాజ్ సమాధియాలా గ్రామంలో 1,700 మంది ఉన్నారు. పోలింగ్ జరిగే కొద్ది రోజుల ముందు ఈ గ్రామంలో ఓ కమిటీ ఏర్పాటువుతుంది. ఈ కమిటీ సభ్యులు.. గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరైనా ఓటు వేయలేని పరిస్థితి ఉంటే కమిటీ ముందు సరైన కారణం చెప్పాలి.

1983 నుంచి..

Gujarat Elections: 1983 నుంచి గ్రామంలో రాజకీయ పార్టీల ప్రచారానికి అనుమతి ఇవ్వడం లేదని రాజ్ సమాధియాలా సర్పంచ్ చెప్పారు. “ప్రచారం చేసేందుకు ఓ రాజకీయ పార్టీని ఇక్కడ అనుమతించం. ఇక్కడ ప్రచారం చేస్తే గ్రామ ప్రజల మనోభావాలను, అభిప్రాయాన్ని దెబ్బ తీసినట్టు అవుతుందని ఏ పార్టీలు కూడా నమ్ముతాయి. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరూ గ్రామంలో ఓటేయాల్సిందే. ఓటు హక్కు వినియోగించుకోని వారికి రూ.51 ఫైన్ విధిస్తాం. ఒకవేళ ఓటు వేసే పరిస్థితిలో లేకుండా.. ముందే అనుమతి తీసుకోవాలి” అని ఆ గ్రామ సర్పంచ్ స్పష్టం చేశారు. ఆ గ్రామంలో మొత్తంగా సుమారు 995 ఓటర్లు ఉన్నారు. వారికి నచ్చిన వారికే ఓటు వేస్తారు.

అధునాతన వసతులు

రాజ్ సమాధియాలా గ్రామంలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వైఫై, సీసీ టీవీ కెమెరాలు, తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్.. ఇలా చాలా వసతులు ఉన్నాయి.

Gujarat Elections: గుజరాత్ ఎన్నికలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 1న తొలి విడత, 5న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలు వస్తాయి.

IPL_Entry_Point