Telugu News  /  National International  /  Gujarat Assembly Polls Bjp Releases First List Of Candidates Rivaba Jadeja Hardik Patel Gets Tickets
Gujarat Elections : గుజరాత్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
Gujarat Elections : గుజరాత్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల (PTI)

Gujarat Elections : గుజరాత్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. జడేజా భార్యకు సీటు

10 November 2022, 14:02 ISTChatakonda Krishna Prakash
10 November 2022, 14:02 IST

BJP First list for Gujarat Assembly Elections 2022 : గుజరాత్ శాసనసభ ఎన్నికల కోసం 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్‍, మోర్బీ దుర్ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ మాజీ ఎమ్మెల్యేకు సీట్లు కేటాయించింది అధికార బీజేపీ.

Gujarat Assembly Elections 2022 - BJP Candidates List : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 160 మంది అభ్యర్థులతో తొలి లిస్ట్ ను గురువారం వెల్లడించింది. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

భారత జట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా (Rivaba Jadeja) కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. జామ్‍నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ వీరమ్‍నగర్ నుంచి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‍కు గుడ్‍బై చెప్పి తమ పార్టీలో చేరిన హార్దిక్‍కు ఈ టికెట్ ఇచ్చింది బీజేపీ. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి.. మజురా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Gujarat Assembly Elections 2022 : సాహస మాజీ ఎమ్మెల్యేకు సీటు!

మోర్బీ తీగల వంతెన ప్రమాదం (Morbi Bridge Collapse) జరిగిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు బీజేపీ ఈసారి సీటు ఇచ్చింది. మోర్బీ ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేశ్ మేర్జాను ఆ పార్టీ పక్కన పెట్టింది. వంతెన ప్రమాదం జరిగిన సమయంలో నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమృతీయ ప్రయత్నించారు.

Gujarat Assembly Elections 2022 : పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

గుజరాత్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) సమావేశం బుధవారం జరిగింది. ఈ మీటింగ్‍లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర డెప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పతో పాటు మరికొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. ఈ సమావేశం తర్వాత ప్రకటించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. 2016 నుంచి 2021 వరకు సీఎంగా పని చేసిన రూపానీ.. ప్రస్తుతం రాజ్‍కోట్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Gujarat Assembly Elections Dates : రెండు దశల్లో పోలింగ్

182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరనుంది. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో 27 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా విజయం సాధించి.. ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది.