తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Visa : స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ఫీజును భారీగా పెంచిన అమెరికా!

US visa : స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ఫీజును భారీగా పెంచిన అమెరికా!

Sharath Chitturi HT Telugu

09 April 2023, 11:35 IST

  • US Student visa cost hike : స్టూడెంట్​, టూరిస్ట్​తో పాటు పలు కేటగిరీల్లోని వీసాల ఫీజును పెంచింది అమెరికా. ఈ ధరలు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ధరలను పెంచిన అమెరికా
స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ధరలను పెంచిన అమెరికా (AFP)

స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ధరలను పెంచిన అమెరికా

US increases Visa cost : అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్​ చేస్తున్న వారికి కీలక అప్డేట్​! స్టూడెంట్​, టూరిస్ట్​తో పాటు పలు కేటగిరీల్లోని​ వీసాల ఫీజులను అగ్రరాజ్యం పెంచింది. ప్రాసెసింగ్​ ఫీజు పెంపు ఇందుకు ప్రధాన కారణం. ఈ 15డాలర్లు- 110డాలర్ల ధరల పెంపు నిర్ణయం మే 30 నుంచి అమల్లోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

వీటి ధరలు పెరిగాయి..

US increases student Visa cost : "బిజినెస్​/ టూరిజం కోసం ఇచ్చే విజిటర్​ వీసా (బీ1/బీ2), స్టూడెంట్​, ఎక్స్​ఛేంజ్​ విజిటర్​ వీసాల ఫీజును 160 డాలర్ల నుంచి 185డాలర్లకు పెంచడం జరిగింది," అని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తాత్కాలిక వర్కింగ్​ వీసాలైన హెచ్​, ఎల్​, ఓ, పీ, క్యూ, ఆర్​ కేటగిరీలకు సైతం ఫీజు పెరిగింది. తాజా పెంపుతో అది 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు చేరింది. ట్రీటీ 'ఈ' కేటగిరీలోని ట్రేడర్​, ట్రీటీ విజిటర్​, ట్రీటీ అప్లికెంట్స్​ ఫీజు 205 డాలర్ల నుంచి ఏకంగా 315 డాలర్లకు పెంచింది అమెరికా ప్రభుత్వం. తాజా నిర్ణయంతో ఇతర కాన్సులర్​ ఫీజుల్లో మార్పులేం లేవని స్పష్టం చేసింది.

వీసాలే.. వీసాలు..

US tourist Visa cost hike : వీసా జారీ చేసే సమయాన్ని తగ్గించేందుకు ఇటీవలి కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది అమెరికా. హెచ్​1బీ వీసాల స్టాంపింగ్​ దేశం బయట కూడా చేసే విధంగా పైలట్​ ప్రాజెక్ట్​ను చేపట్టాలని నిర్ణయించింది. ఇది రానున్న నెలల్లో అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం వర్కింగ్​ వీసాల కోసం అప్లై చేస్తున్న భారతీయులు 60-280 రోజుల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ట్రావెలింగ్​ వీసాకైతే ఏకంగా 1-ఒకటిన్నరేళ్ల వరకు సమయం పడుతోంది. గతేడాది 1,25,000 మంది భారతీయులకు స్టూడెంట్​ వీసాలను జారీ చేసింది అమెరికా రాయబార కార్యాలయం. ఇదొక రికార్డు. అయితే ఈ ఏడాది ఈ రికార్డు బ్రేక్​ అవుతుందని అంచనాలు ఉన్నాయి.