తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Student Visa: ‘ఇక సంవత్సరం ముందే యూఎస్ స్టుడెంట్ వీసాకు అప్లై చేసుకోవచ్చు..’

US student visa: ‘ఇక సంవత్సరం ముందే యూఎస్ స్టుడెంట్ వీసాకు అప్లై చేసుకోవచ్చు..’

HT Telugu Desk HT Telugu

25 February 2023, 17:00 IST

  • US student visa: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకపై యూఎస్ స్టుడెంట్ వీసా కోసం సంవత్సరం ముందే అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Representational)

ప్రతీకాత్మక చిత్రం

US student visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆ దేశం మరో వెసులుబాటును కల్పించింది. భారత్ సహా విదేశాల్లోని విద్యార్థులు అమెరికా స్టుడెంట్ వీసా ( US student visa) కోసం ఇకపై కోర్సు ప్రారంభం కావడానికి ఏడాది ముందే ఎఫ్ 1 వీసా (F-1 visa) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

US student visa: కానీ నెల రోజుల ముందే యూఎస్ లోకి..

యూఎస్ స్టుడెంట్ వీసా (US student visa) కొరకు విద్యార్థులు కోర్సు ప్రారంభం కావడానికి ఏడాది ముందే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు, ఎకడమిక్ టర్మ్ ప్రారంభం కావడానికి 4 నుంచి 6 నెలల ముందు మాత్రమే ఐ 20 ఫామ్స్ (I-20 forms) ను ఇష్యూ చేసేవారు. అలాగే, ఎకడమిక్ టర్మ్ ప్రారంభం కావడానికి 120 రోజుల ముందు మాత్రమే ఇంటర్య్వూ లను షెడ్యూల్ చేసేవారు. తాజాగా, ఆ నిబంధనను మార్చారు. ఇప్పుడు, అమెరికాలోని యూనివర్సిటీలు కూడా అకడమిక్ కోర్స్ (academic term) ప్రారంభం కావడానికి 12 నుంచి 14 నెలల ముందే ఐ 20 ఫామ్స్ (I-20 forms) ను ఇష్యూ చేస్తాయి. అలాగే, ఇప్పడు 365 రోజుల ముందే దరఖాస్తు చేసుకునే వీలు కలగడం వల్ల, విద్యార్థులకు అన్ని విధాలుగా సిద్ధం కావడానికి సమయం లభిస్తుంది. కానీ, వీసా లభించిన తరువాత అకడమిక్ టర్మ్ (academic term) ప్రారంభం కావడానికి 30 రోజుల ముందు మాత్రమే విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. వీసా (US Visa) ల జారీకి సంబంధించి అమెరికాకు భారత్ అత్యంత ప్రాధాన్య దేశమని యూఎస్ కాన్సులేట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కోవిడ్ మహమ్మారి కన్నా ముందు భారతీయులకు జారీ చేసిన వీసా (US Visa) ల కన్నా ఈ సంవత్సరం ఇప్పటివరకు 36% ఎక్కువ వీసాలను భారతీయులకు జారీ చేశామన్నారు.

టాపిక్