US visa news: వీసా దరఖాస్తులకు డ్రాప్ బాక్స్ లు: యూఎస్ ఎంబసీ-us visa application can now be submitted through dropbox us embassy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Us Visa Application Can Now Be Submitted Through Dropbox: Us Embassy

US visa news: వీసా దరఖాస్తులకు డ్రాప్ బాక్స్ లు: యూఎస్ ఎంబసీ

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 04:32 PM IST

US visa news: అమెరికా వీసాకు (US visa) దరఖాస్తు చేసుకునే వారు ఇకపై డ్రాప్ బాక్స్ (drop box) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని భారత్ లోని యూఎస్ ఎంబసీ (US embassy) ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

US visa news: అమెరికా వీసా (US visa) కు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై డ్రాప్ బాక్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని భారత్ లోని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు పంపవచ్చా? అన్న ప్రశ్నకు ఎంబసీ పై విధంగా సమాధానమిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

US visa news: 2022లో..

ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో స్టుడెంట్ వీసా (US Student visa) దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ముంబైలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో కాన్సులార్ చీఫ్ గా ఉన్న జాన్ బలార్డ్ తెలిపారు. అంచనాకు మించి వచ్చే దరఖాస్తులను (US Student visa) సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 2022 సంవత్సరంలో మొత్తం 1,25,000 లక్షల స్టుడెంట్ వీసా (US Student visa) దరఖాస్తులను ప్రాసెస్ చేశారు.

US visa news: శనివారాలు కూడా..

మరోవైపు, తొలి సారి వీసా (US visa) కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అలాగే, వారి వెయిటింగ్ టైమ్ ను తగ్గించడానికి వీసా ప్రాసెసింగ్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నారు. ఫస్ట్ టైమ్ వీసా (US visa) దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేయడానికి జనవరి 21 నుంచి ప్రత్యేకంగా శనివారాలు కూడా స్లాట్స్ ఓపెన్ చేశారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ ల్లోని కాన్సులార్ కార్యాలయాల్లో శనివారాలు కూడా ఫస్ట్ టైమ్ అప్లికంట్స్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. గతంలో వీసా (US visa) పొందినవారు మళ్లీ ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేకుండా రిమోట్ ప్రాసెసింగ్ చేయాలని యూఎస్ ఎంబసీ నిర్ణయించింది.

IPL_Entry_Point

టాపిక్