US Visa news : అమెరికా వీసాకు అప్లై చేస్తున్న వారికి గుడ్​ న్యూస్​..!-us mission in india announces new initiative to cut visa wait time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Us Mission In India Announces New Initiative To Cut Visa Wait Time

US Visa news : అమెరికా వీసాకు అప్లై చేస్తున్న వారికి గుడ్​ న్యూస్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 23, 2023 06:58 AM IST

US Visa for Indians : అమెరికా వీసాకు అప్లై చేస్తున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​! భారతీయుల వీసా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అమెరికా పలు కీలక చర్యలు చేపట్టింది.

అమెరికా వీసాకు అప్లై చేస్తున్న భారతీయులకు గుడ్​ న్యూస్​
అమెరికా వీసాకు అప్లై చేస్తున్న భారతీయులకు గుడ్​ న్యూస్​

US Visa latest news : అమెరికా వీసా అప్లై చేస్తున్నవారికి, వీసాకు అప్లై చేస్తున్న భారతీయులకు గుడ్​ న్యూస్​! భారతీయుల వీసా ప్రాసెసింగ్​ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు భారీ చర్యలు చేపట్టింది అమెరికా. ప్రత్యేక ఇంటర్వ్యూలను షెడ్యూల్​ చేయడంతో పాటు కాన్సులర్​ సిబ్బంది సంఖ్యను పెంచడం ఈ చర్యల్లో భాగం.

వీసా బ్యాక్​లాగ్​లను కట్​ చేసే క్రమంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్​లోని కాన్సులేట్స్​లో "స్పెషల్​ శాటర్​డే ఇంటర్వ్యూ డేస్​"ను నిర్వహించనున్నారు!

US Visa waiting period : "ఇండియాలోని యూఎస్​ మిషన్​ చర్యల్లో భాగంగా.. ఈ నెల 21న తొలి 'స్పెషల్​ శాటర్​డే ఇంటర్వ్యూ డేస్​'ను నిర్వహించాము. ఇది ఓ సిరీస్​. ముందు ముందు కూడా ఇలాంటివి జరుగుతాయి. మొదటిసారి వీసాకు అప్లై చేస్తున్న వారి వెయిటింగ్​ టైమ్​ను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టాము," అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

రానున్న నెలల్లో.. ఎంపిక చేసిన కొన్ని శనివారాల్లో అడిషనల్​ స్లాట్స్​కు అనుమతులిచ్చి.. ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూఎస్​ ఎంబసీ స్పష్టం చేసింది. కొవిడ్​ సంక్షోభం కారణంగా ఏర్పడిన భారీ వెయిటింగ్​ పీరియడ్​ను తగ్గించి, వీసా ప్రాసెసింగ్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు వివరించింది.

వాషింగ్టన్​ నుంచి అధికారులు..

US Visa appointment for Indians : ఇక కాన్సులర్​ సిబ్బంది సంఖ్యను తాత్కాలికంగా పెంచేందుకు.. 2023 జనవరి నుంచి మార్చ్​ వరకు అనేక మంది అమెరికా అధికారులు.. వాషింగ్టన్​ నుంచి ఇండియాకు రానున్నారు. ఫలితంగా వీసా ప్రాసెసింగ్​ కెపాసిటీ పెరగడంతో పాటు వెయిటింగ్​ పీరియడ్​ కూడా తగ్గుతుంది.

ఈ క్రమంలో.. ఇప్పటికే 2,50,000 అడిషనల్​ బీ1/ బీ2 అపాయింట్​మెంట్లను విడుదల చేసింది ఇండియాలోని యూఎస్​ మిషన్​. బీ1 అంటే బిజినెస్​ వీసా. బీ2 అంటే టూరిజం వీసా.

US Visa processing time : అంతేకాకుండా.. ముంబైలోని కాన్సులేట్​ జనరల్​.. వీక్​డేస్​లో పని గంటలను పెంచుకుంది. అదనంగా వస్తున్న అపాయింట్​మెంట్స్​కు ఇది ఉపయోగపడుతుంది. వేసవి నాటికి.. ఇండియాలో యూఎస్​ మిషన్​ సిబ్బంది సంఖ్య.. కొవిడ్​ ముందు స్థాయికి చేరుతుందని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

ఇండియాలో అత్యధిక యూఎస్​ వీసా అప్లికేషన్లు ముంబైలోని కాన్సులేట్​కు వెళుతాయి. వీసా అప్లికేషన్​ కార్యకలాపాల్లో.. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్సులేట్​ ఇదే అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

US Visa news in Telugu : "అంతర్జాతీయ పర్యాటకుల వీసాల వెయిటింగ్​ పీరియడ్​ను తగ్గించేందుకు.. మా కాన్సులర్​ బృందాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అమెరికాకు వెళ్లాలని భావిస్తున్న వారికి ఇది గుడ్​ న్యూస్​," అని ముంబై కాన్సులర్​ చీఫ్​ జాన్​ బల్లార్డ్​ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం