US visa news: అమెరికా వీసాలకు సంబంధించి కీలక అప్ డేట్ ను ప్రకటించిన USCIS-us may expand premium processing of these visa green card categories details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Visa News: అమెరికా వీసాలకు సంబంధించి కీలక అప్ డేట్ ను ప్రకటించిన Uscis

US visa news: అమెరికా వీసాలకు సంబంధించి కీలక అప్ డేట్ ను ప్రకటించిన USCIS

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 03:13 PM IST

US visa, green card news: అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. గ్రీన్ కార్డ్ తో పాటు పలు కేటగిరీల వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను చేపట్టాలని యూఎస్ నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

US visa, green card news: అమెరికాలో గ్రీన్ కార్డు రావాలంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిందే. కానీ, తాజాగా, కొన్ని ముఖ్యమైన గ్రీన్ కార్డ్ కేటగిరీల దరఖాస్తులకు, కొన్ని వీసా కేటగిరీల దరఖాస్తులకు ప్రీమియం ప్రాసెసింగ్ (premium processing of US visas) అవకాశం కల్పించాలని అమెరికా నిర్ణయించింది. విదేశీ విద్యార్థుల (foreign students training) శిక్షణకు సంబంధించిన వీసా కేటగిరీ కూడా ఇందులో ఉంది. దశల వారీగా ఈ ప్రీమియం ప్రాసెసింగ్ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది.

US visa, green card news: మొదట గ్రీన్ కార్డు అప్లికేషన్లు..

ప్రీమియం ప్రాసెసింగ్ కోరుకుంటున్న దరఖాస్తు దారులు సుమారు 2500 డాలర్లు (USD 2500) చెల్లించాల్సి ఉంటుంది. దశలవారీగా చేపట్టే ఈ ప్రీమియం ప్రాసెసింగ్ (premium processing of US visas) కేటగిరీల ఎక్స్ పాన్షన్ లో మొదట గ్రీన్ కార్డులకు సంబంధించిన ఈబీ 1(EB-1) వీసా కేటగిరీ అప్లికేషన్లకు, ఆ తరువాత ఈబీ 2(EB-2) కేటగిరీ అప్లికేషన్లకు ప్రీమియం ప్రాసెసింగ్ అవకాశం కల్పిస్తారు.

premium processing of US visas: ఇతర వీసా కేటగిరీలకు కూడా..

E13 మల్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ హోదాల వారు గతంలో దరఖాస్తు చేసుకున్న ఫామ్ ఐ 140 (I 140) పిటిషన్లకు కూడా ప్రీమియం ప్రాసెసింగ్ (premium processing of US visas) కు అవకాశం కల్పిస్తారు. అమెరికా లీగల్ ఇమిగ్రేషన్ సిస్టమ్ పై ఉన్న భారాన్ని తగ్గించడానికి, నిర్వహణ సామర్ధ్యం పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది.

premium processing of US student visas: స్టుడెంట్ వీసాలకు కూడా..

ఎఫ్ 1 (F-1) స్టుడెంట్ వీసాలకు సంబంధించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కోరుకునే కొన్ని కేటగిరీలకు కూడా ఈ మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రీమియం ప్రాసెసింగ్ (premium processing of US visas) సదుపాయం కల్పించనున్నారు. అలాగే, ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ పెండింగ్ లో ఉన్న స్టెమ్ ఓపీటీ ఎక్స్ టెన్షన్ (STEM OPT extension) ఫామ్ I-765 దరఖాస్తులకు కూడా ప్రీమియం ప్రాసెసింగ్ (premium processing of US visas) సదుపాయం కల్పించనున్నారు. ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్(AAPI)పై నెలకొల్పిన ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS వెల్లడించింది.

Whats_app_banner