Different types of US visas: అమెరికా వెళ్లడానికి ఎన్ని రకాల వీసాలున్నాయో తెలుసా?-what are the different types of visas available for visiting united states of america ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Are The Different Types Of Visas Available For Visiting United States Of America?

Different types of US visas: అమెరికా వెళ్లడానికి ఎన్ని రకాల వీసాలున్నాయో తెలుసా?

Sudarshan Vaddanam HT Telugu
Jan 11, 2023 02:55 PM IST

US visa: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్లడానికి ఎన్ని వీసా (visa) కేటగిరీలున్నాయో తెలుసా? మీ ప్రయాణ అవసరాన్ని బట్టి వీసా కేటగిరీలు మారుతుంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

US visa: తమ దేశం వచ్చేవారికి అమెరికా పలు రకాల వీసా (visa) లను అందిస్తుంటుంది. వాటిలో పర్యాటకులకు ఇచ్చే బీ 2(B-2) వీసా నుంచి విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ 1 (F-1) వరకు, నిపుణలైన ఉద్యోగులకు ఇచ్చే హెచ్ 1 బీ (H-1B) నుంచి ఆర్టిస్టులకు ఇచ్చే ఓ 1(O-1) వరకు వివిధ కేటగిరీలున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

US tourist visa: టూరిస్ట్ వీసా B-2

అమెరికా పర్యటించే వారికి ఆ దేశం బీ2 (B-2) వీసా ఇస్తుంది. వైద్యం, విహారం, వినోదం కోసం అమెరికా వెళ్లే వారికి ఆ వీసా లభిస్తుంది. బీ 2(B-2) వీసా పొందాలంటే మీరు అమెరికాలో కొద్ది రోజులే ఉండబోతున్నారని, మీ ట్రిప్ పూర్తి చేయడానికి అవసరమైన డబ్బులు మీ దగ్గర ఉన్నాయని, యూఎస్ లో హోటల్ రిజర్వేషన్ ఉందని, తిరుగుప్రయాణ టికెట్లు తీసుకున్నారని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తారు. అవసరమైతే, మరో ఆరు నెలలు పొడగిస్తారు.

US student visa: స్టుడెంట్ వీసా F-1

అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే వారికి ఈ వీసా(F-1) ను ఇస్తారు. ఈ వీసాను పొందడానికి ముందుగా, మీకు అమెరికాలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్ లభించి ఉండాలి. అందుకుగానూ, సంబంధిత విద్యా సంస్థ నుంచి అందిన ఐ 20 (I-20) మీ వద్ద సిద్ధంగా ఉండాలి. కోర్సు పూర్తి చేయడానికి, కోర్సు పూర్తయ్యే వరకు యూఎస్ లో ఉండడానికి అవసరమైన డబ్బులు సిద్ధంగా ఉన్నట్లు చూపించాలి. ఈ వీసా (F-1) కాలపరిమితి సాధారణంగా కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, అన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత, తిరిగి రావడానికి అవసరమైన ఏర్పాటు చేసుకోవడానికి మరో రెండు నెలల సమయం ఇస్తారు.

US temporary work visa: నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే వీసా H-1B

ఇది టెంపరరీ వర్క్ వీసా. ఇంజినీరింగ్, సైన్స్, కంప్యూటర్ ప్రొగ్రామింగ్ తదితర వివిధ నైపుణ్యాలున్న ఉద్యోగులు అమెరికాలో జాబ్ చేయడం కోసం ఈ వీసా (H-1B) అవసరం. ఈ వీసా పొందాలంటే అమెరికాలోని కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ ఉండాలి. మీరు జాబ్ చేసే ఫీల్డ్ లో కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 3 సంవత్సరాల కాలపరిమితితో ఈ వీసా (H-1B) ఇస్తారు. అవసరమైతే, మరో మూడేళ్లు పొడగిస్తారు.

US temporary work visa: ట్రాన్స్ ఫర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే వీసా L-1

ఇది కూడా తాత్కాలిక వర్క్ వీసానే. విదేశాల్లోని తమ కంపెనీ బ్రాంచ్ లేదా తమ అఫిలియేటెడ్ కంపెనీ నుంచి అమెరికాలోని బ్రాంచ్ లేదా మెయిన్ ఆఫీస్ కు బదిలీ అయిన ఉద్యోగులకు ఇచ్చే వీసా (L-1) ఇది. ఈ వీసా పొందాలంటే సంబంధిత కంపెనీలో కనీసం ఒక సంవత్సరం జాబ్ చేసి ఉండాలి. అలాగే, ఆ కంపెనీ నుంచి మేనేజీరియల్ లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో అమెరికాలో జాబ్ చేయడానికి రావాలి. ఈ వీసా (L-1) కాల పరిమితి మేనేజీరియల్ లేదా ఎగ్జిక్యూటివ్ హోదా సాధారణంగా ఏడేళ్లు, నిపుణులైన ఇతర ఉద్యోగులకు ఐదేళ్లు ఉంటుంది.

US Business visa: వ్యాపారవేత్తలకు ఇచ్చే వీసా E-2

వ్యాపార వేత్తలకు, అంట్రాప్రన్యూర్స్(ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు) ఈ E-2 వీసా ఇస్తారు. అమెరికాలో బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టేవారికి, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన సంస్థలను నిర్వహించడానికి వచ్చే వారికి ఈ E-2 వీసా ఇస్తారు. యూఎస్ లోని వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడి పెట్టినవారికి లేదా అమెరికాతో వ్యాపార సంబంధ ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల వారికి ఈ E-2 వీసా ఇస్తారు. ఈ E-2 వీసాను మొదట ఐదేళ్ల కాల పరిమితితో ఇస్తారు. ఆ తరువాత యూఎస్ లో వ్యాపారం కొనసాగిస్తున్నంత కాలం వీసా కాల పరిమితిని పొడగించుకోవచ్చు.

US Exchange program visa: ఎక్స్ చేంజ్ ప్రొగ్రామ్ కోసం J-1 వీసా

ఇది ఎక్స్ చేంజ్ విజిట్ వీసా. అమెరికా తో ఎక్స్ చేంజ్ ప్రొగ్రామ్ లో భాగంగా వస్తున్నవారికి జే 1 (J-1) వీసా ఇస్తారు. అలాగే, ఆర్ట్స్, సైన్స్, అథ్లెటిక్స్ లో అసాధారణ ప్రతిభ ఉన్నవారికి O-1 వీసాను, ఎంటర్ టైన్ మెంట్ ప్రొగ్రామ్స్ లో, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి యూఎస్ వస్తున్నవారికి P-1 వీసాను అందిస్తారు.

IPL_Entry_Point