US tourist visa : అమెరికాలో ‘టూరిస్ట్ వీసాల’పై ఉద్యోగాలు చేసుకోవచ్చు!
US Visa News: అమెరికాలో ఇక నుంచి టూరిస్ట్ వీసాలతో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు! ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
US tourist visa jobs : బిజినెస్, టూరిస్ట్ వీసాల మీద అమెరికా వెళుతున్న వారికి గుడ్ న్యూస్! సంబంధిత వీసాలతో అమెరికాలో ఉద్యోగాలకు అప్లై చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఉద్యోగాల్లో చేరిన తర్వాత.. వీసాదారులు తమ వీసా స్టేటస్‌ను మార్చుకోవాలని సూచించింది. బీ-1, బీ-2తో పాటు వివిధ తాత్కాలిక వీసాలకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది.
'ఉద్యోగాలు చేసుకోవచ్చు..'
"బీ-1, బీ-2 స్టేటస్‌పై కొత్త ఉద్యోగాలు వెతుక్కోవచ్చా? అని చాలా మంది అడుగుతున్నారు. వెతుక్కోవచ్చు అన్నదే మా సమాధానం. ఉద్యోగాల ఇంటర్వ్యూలకు కూడా హాజరవ్వచ్చు," అని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ట్వీట్ చేసింది.
US visa news : మరోవైపు.. నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్లు.. ఉద్యోగాలు కోల్పోతే 60 రోజుల్లోపు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అమెరికాలోని నిబంధనలు సూచిస్తున్నట్టు చెబుతుంటారు. అయితే.. ఉద్యోగం కోల్పోతే, దేశాన్ని విడిచి వెళ్లిపోవడమే సంబంధిత వ్యక్తుల ముందు ఉన్న ఏకైక ఆప్షన్ కాదని యూఎస్సీఐఎస్ పేర్కొంది.
- ఉద్యోగం కోల్పోయిన వారు తమ నాన్ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకునేందుకు అప్లికేషన్ వేయవచ్చు.
- స్టేటస్‌ను అడ్జెస్ట్ చేసుకునేందుకు అప్లికేషన్ వేయవచ్చు.
- 'కంపెల్లింగ్ సర్కమ్‌స్టాన్సెస్ (ప్రతికూల పరిస్థితులు) అథారైజేషన్ డాక్యుమెంట్స్' కోసం అప్లై చేసుకోవచ్చు.
Jobs in US on tourist visa : అయితే.. వీటిల్లో ఒకదానిని 60 రోజుల గడువులోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. సంబంధిత వ్యక్తితో పాటు వారిపై ఆధారపడి జీవిస్తున్న వారు అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
వీసా స్టేటస్ మార్చుకోవాలి.. లేకపోతే!
ఇక బీ-1, బీ-2 వీసాలపై ఉద్యోగాలు వెతుక్కుని, జాబ్‌లో చేరే ముందు.. సంబంధిత వ్యక్తులు తమ వీసా స్టేటస్‌ను కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేరడానికి ముందే.. ఈ వీసా స్టేస్ మారిపోయి ఉండాలి. ఒక వేళ వీసా స్టేటస్ మార్చేందుకు అధికారులు అంగీకరించకపోతే.. సంబంధిత వ్యక్తులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం