తెలుగు న్యూస్  /  National International  /  Us Announces Premium Processing Of Work Authorisation For Certain Categories Of International Students

US visa: స్టుడెంట్ వీసాలపై అమెరికా కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu

07 March 2023, 15:23 IST

  • US visa: వర్క్ ఆథరైజేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ కు సంబంధించి అమెరికా శుభవార్త తెలిపింది. తాజా నిర్ణయం ద్వారా భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.  

ప్రతకాత్మక చిత్రం
ప్రతకాత్మక చిత్రం

ప్రతకాత్మక చిత్రం

US visa: పలు కేటగిరీలకు చెందిన వివిధ దేశాల విద్యార్థుల వర్క్ ఆథరైజేషన్ దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ను ప్రారంభిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (science, technology, engineering and mathematics - STEM) సబ్జెక్టుల్లో ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

optional practical training: ఓపీటీ ఇక మరింత ఈజీ

STEM సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (optional practical training OPT) పొడగింపు దరఖాస్తులను మార్చి 6వ తేదీ నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ కు అనుమతిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (US Citizenship and Immigration Services USCIS) ప్రకటించింది. మరికొన్ని ఇతర విభాగాల ప్రీమియం ప్రాసెసింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ ఫిల్లింగ్ ఫెసిలిటీ USCIS వెబ్ సైట్లో అందుబాటులో ఉందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జాదౌ తెలిపారు. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. స్టెమ్ సహా వివిధ కేటగిరీల ఎఫ్ 1 వీసా (F-1) విద్యార్థుల ఓపీటీ పొడగింపు దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ కు అమెరికా తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

premium processing: ఆన్ లైన్ ప్రొసీజర్ ఇదే..

ప్రీమియం ప్రాసెసింగ్ ను అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకునే ఐ 907 (I-907) ఆన్ లైన్ ఫిలింగ్ ప్రొసీజర్ ఇప్పుడు స్టెమ్ సహా పలు కేటగిరీల ఎఫ్ 1 (F-1) విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఓపీటీ అనుమతులు పొందడంలో నెలకొంటున్న జాప్యం ఈ నిర్ణయంతో తొలగిపోతుందని భావిస్తున్నారు. I-765 ఫామ్ పెండింగ్ లో ఉన్న ఎఫ్ 1 స్టుడెంట్స్ కూడా ఇప్పుడు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఐ 907 ఫామ్స్ ను USCIS కి పంపించవచ్చు. అలాగే, స్టెమ్ సహా పలు కేటగిరీల విద్యార్థులు ఏప్రిల్ 3 నుంచి I-765 ఫామ్, I-907 ఫామ్ లను ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీటీ అప్రూవల్స్ త్వరితగతిన లభిస్తాయి.