Viral: ఎలాంటి చదువు లేకున్నా సంవత్సరానికి రూ.1.3కోట్ల జీతం అందుకుంటున్నాడు!-man with no education earns 1 3 crore rupees in a year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral: ఎలాంటి చదువు లేకున్నా సంవత్సరానికి రూ.1.3కోట్ల జీతం అందుకుంటున్నాడు!

Viral: ఎలాంటి చదువు లేకున్నా సంవత్సరానికి రూ.1.3కోట్ల జీతం అందుకుంటున్నాడు!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 28, 2023 06:34 PM IST

Man Earns Rs.1.3 crore a Year: ఉన్నత విద్య చదవకున్నా ఓ వ్యక్తి సంవత్సరానికి ఏకంగా రూ.1.3కోట్ల వేతనం అందుకుంటున్నాడు. అయితే ఆయన చేస్తున్న పని మాత్రం శారీరకంగా చాలా కష్టంతో కూడుతున్నది.

Viral: ఎలాంటి చదువు లేకున్నా సంవత్సరానికి రూ.1.3కోట్ల జీతం అందుకుంటున్నాడు! (Cory Rockwell/TikTok)
Viral: ఎలాంటి చదువు లేకున్నా సంవత్సరానికి రూ.1.3కోట్ల జీతం అందుకుంటున్నాడు! (Cory Rockwell/TikTok)

Man Earns Rs.1.3 crore a Year: ఉన్నత విద్య చదవకున్నా.. ఎక్కువ స్థాయి నైపుణ్యాలు లేకున్నా ఓ వ్యక్తి ఏకంగా సంవత్సరానికి 1.60లక్షల డాలర్లు (సుమారు 1.3 కోట్లు) సంపాదిస్తున్నారు. మైనింగ్ కంపెనీలో పని చేస్తూ ఇంత భారీ వేతనం అందుకుంటున్నారు. ఆయన పేరు కోరీ రాక్‍వెల్ (Cory Rockwell). వివరాలివే.

దిక్కుతోచని స్థితి నుంచి..

జీవితంలో ఏం చేయాలో తెలియక ఓ దశలో కోరీ రాక్‍వెల్ అమెరికాలోని లాస్ఏంజిల్స్ (Los Angeles) లో చిక్కుకుపోయారు. తనకు సాధారణ ఉద్యోగాలు సెట్ కావని నిర్ణయించుకున్నారు. “నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాంటి ఐడియాలో లేకుండేది. అప్పుడు నాకు ఎలాంటి చదువు లేదు. స్కిల్స్ కూడా లేవు. గర్ల్ ఫ్రెండ్, పిల్లలు ఎవరూ లేరు. నేనింక లాస్ ఏంజిల్స్ నుంచి వెళ్లిపోదామనుకున్నాను” అని ఇన్‍సైడర్‌ మీడియా సంస్థతో రాక్‍వెల్ చెప్పారు.

ఓ సూపర్ మార్కెట్‍లో ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమవడమే రాక్‍వెల్ జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలో ఏ పని దొరకక ఆయన ఓ మైనింగ్ కంపెనీలో తవ్వకాలు చేసే మైనర్‌ పనికి జాయిన్ అయ్యారు.

మైనింగ్ కంపెనీలో..

మైనింగ్ ఏజెన్సీ జియోటెంప్స్.. ముందుగా కోరీ రాక్‍వెల్‍ను ఆరు నెలల కోసం నియమించుకుంది. నెవాడాలోని ఒరోవడాలో కోరీ పని చేశారు. ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే మైన్స్‌ ఉరితలంపై కాకుండా.. అండర్‌ గ్రౌండ్‍లో పని చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. అండర్‌ గ్రౌండ్‍కు మారారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మరోసారి మార్చింది.

ఏం చేస్తున్నారంటే.

నెవడా కాపర్ మైన్‍లో ప్రస్తుతం కోరీ రాక్‍మ్యాన్.. మైనర్‌గా పని చేస్తున్నారు. అయితే అండర్‌ గ్రౌండ్‍లో పని చేయడం చాలా కష్టమైన విషయం. ఆ మైన్‍లో ఆయన శరీరం నిండా దుమ్మే ఉంటుంది. శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న పని చేస్తున్నారు రాక్‍వెల్. భూమిలోకి డ్రిల్ చేసిన రంధ్రాల్లో విస్ఫోటనాలు (Explosive) పంపడమే తన పని అని కోరీ చెప్పారు. తనకు వేతనం నచ్చిందని, ఇది కూడా ఆఫీస్ ఉద్యోగం లాంటిదేనని అన్నారు. నాలుగేళ్ల నుంచి ఆయన పని చేస్తున్నారు.

“వేతనం చాలా బాగుంది. నేను ఒక సంవత్సరంలో 1,60,000 డాలర్లు సంపాదించాను. వార్షిక వేతనం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. నెవాడ కాపర్‌ మైన్స్ లో డ్రిల్ చేసిన హోల్స్‌లో ఎక్స్‌ప్లోజివ్స్ ఉంచడమే నా పని. అండర్‌ గ్రౌండ్‍ మైనింగ్ కూడా ఆఫీస్ జాబ్ లాంటిదే” అని కోరీ రాక్‍స్టోన్ తెలిపారు.

ఈ పని చేశాక తాను మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతానని కోరీ చెప్పారు. ఒక్కోసారి సులభంగా 20 గంటల పాటు నిద్రపోతానని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా తన పనిని తాను ప్రేమిస్తానని అన్నారు.

IPL_Entry_Point