తెలుగు న్యూస్  /  Lifestyle  /  These 5 Bad Habits Can Cause Private Parts Of Men To Shrink Details Inside

Bad Habits : ఈ ఐదు అలవాట్లతో పురుషాంగం సైజ్ మీద ఎఫెక్ట్

HT Telugu Desk HT Telugu

02 April 2023, 12:00 IST

    • Private Parts : కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎక్కువగా బాధపడుతుంటారు. కుచించికుపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో తెలియని ఆందోళనకు గురవుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా?
పురుషాంగం సైజు సమస్య
పురుషాంగం సైజు సమస్య

పురుషాంగం సైజు సమస్య

పురుషులు తమ పురుషాంగం పరిమాణాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. కొంతమంది ఆయుర్వేద మందులు(Ayurveda Medicine) వాడుతుంటారు. అయితే వాటికంటే మీ అలవాట్లే(Habits) పురుషాంగం సైజు మీద ప్రభావం చూపుతుంది. కొన్ని అలవాట్లు ఆ విషయాన్ని మరింత దిగజార్చవచ్చు. మీ ప్రైవేట్ భాగం కుంచించుకుపోయేలా చేయవచ్చు. జీవనశైలి అలవాట్లు(Lifestyle Habits), వ్యాయామం చేయకపోవడం, అధిక ధూమపానం, జంక్ ఫుడ్స్‌ ఎక్కువ తినడం వంటివి వాటితో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కొన్ని అలవాట్లు వదులుకుంటే.. మీరు హ్యాపీగా ఉండొచ్చు.

సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ నుండి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువ వ్యాయామం(exercise) చేసే పురుషులు మెరుగైన అంగస్తంభన, లైంగిక పనితీరును కలిగి ఉంటారు. రెగ్యులర్ వ్యాయామం పురుషాంగం పెరుగుదలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచడం, అడ్డుపడే రక్తనాళాలను క్లియర్ చేయడం ద్వారా అంగస్తంభన, లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది.

జర్నల్ ఆఫ్ పీరియాడోంటాలజీకి చెందిన పరిశోధకులు అంగస్తంభన సమస్య ఉన్న పురుషులలో చిగుళ్ల వ్యాధి 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. గమ్ కణజాలంలో కనిపించే బాక్టీరియా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఫలితంగా మంట, ప్రైవేట్ భాగంలో రక్త నాళాలు దెబ్బతింటాయి.

2011 హార్వర్డ్ అధ్యయనం ప్రకారం, కుకీలు, కేకులు, చాక్లెట్లు, చిప్స్, వేయించిన భోజనం వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలు(Processed Food) తినే పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించే వారి కంటే తక్కువ నాణ్యత గల స్పెర్మ్(Sperm) కలిగి ఉంటారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. దీని వలన బరువు, నడుము రేఖలు పెరిగేకొద్దీ ప్రైవేట్ భాగం తగ్గిపోతుంది.

ధూమపానం(Smoking)తో పురుషాంగం పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది. ప్రైవేట్ పార్ట్‌(Private Part)తో సహా అనేక శరీర అవయవాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. సిగరెట్‌లోని హానికరమైన భాగాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇది అంగస్తంభన లోపం, పురుషాంగ కణజాలాలకు నష్టం కలిగిస్తుంది.

యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే పండ్లు(Fruits), కూరగాయలను తినడం ప్రైవేట్ పార్ట్‌కు అవసరం. ఎందుకంటే అవి రక్త నాళాలలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రక్తనాళాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. 2008 టెక్సాస్ A అండ్ M యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, పుచ్చకాయలో సిట్రులిన్-అర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అంగస్తంభనకు ఉపయోగపడుతుంది. మీ ప్రైవేట్ పార్ట్స్ కుచించుకుపోకుండా పైన చెప్పిన ఐదు అలవాట్లను మానుకోండి.