Erectile Dysfunction At 30 : 30 ఏళ్లకే అంగస్తంభన సమస్య.. మీరు ఆ లిస్టులో ఉన్నారా?-erectile dysfunction at 30 what can cause it ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Erectile Dysfunction At 30 What Can Cause It

Erectile Dysfunction At 30 : 30 ఏళ్లకే అంగస్తంభన సమస్య.. మీరు ఆ లిస్టులో ఉన్నారా?

అంగస్తంభన సమస్య
అంగస్తంభన సమస్య

జీవనశైలి మారింది. ముప్పై ఏళ్లకే ఏవేవో సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి అంగస్తంభన లోపం. 30 ఏళ్ళ వయసులోనే అంగస్తంభన లోపంతో కొంతమంది బాధపడుతున్నారు. దీనికి కారణం ఏమిటి? మీరు ఆ ప్రమాదంలో ఉన్నారా?

అంగస్తంభన, శీఘ్ర స్ఖలనం వంటి లైంగిక సమస్యలతో చాలామంది పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రకాల మందులను వాడుతున్నారు. ఈ ఔషధాల ఉపయోగం దీర్ఘకాలం అంగస్తంభన సమస్యలు, ఇతర దుష్ప్రభావాలకు కారణం కావొచ్చు. చాలా సందర్భాలలో లైంగిక పనితీరును పెంపొందించడానికి డ్రగ్స్(Drugs) వాడుతారు కొంతమంది.

ట్రెండింగ్ వార్తలు

సహజంగా లభించే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు సెక్స్ కొనసాగించవచ్చు. మరింత ఆనందాన్ని పొందవచ్చు. అవి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. స్పెర్మ్ నాణ్యత(Sperm Quality)ను మెరుగుపరుస్తాయి. అంగస్తంభన లోపం నుంచి బయటపడొచ్చు. లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.

కొన్ని సందర్భాల్లో అంగస్తంభన లోపం(Erectile Dysfunction) చిన్న వయస్సులో సంభవించవచ్చు. ఉదాహరణకు, ముప్పై సంవత్సరాల వయస్సులో కొంతమంది ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అంగస్తంభన సమస్య ముఖ్యంగా సవాలుగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా లైంగిక పనితీరు తగ్గిపోవడాన్ని తట్టుకోలేడు. పురుషులు ఏ వయస్సులోనైనా తేలికపాటి, అప్పుడప్పుడు లేదా పూర్తి అంగస్తంభన సమస్యను ఎదుర్కొవచ్చు. ఈ విషయంపై చాలా పరిశోధనలు జరిగినప్పటికీ, ఎంతమంది పురుషులు దీనిని అనుభవిస్తున్నారనేది అస్పష్టంగా ఉంది.

27,000 మంది పురుషులను పరిశీలించిన జర్నల్ ట్రాన్సలేషనల్ ఆండ్రాలజీ అండ్ యూరాలజీలో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, 20 మరియు 29 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో 8 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. 11 శాతం మంది 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ సమస్యతో ఉన్నారు.

30 ఏళ్ల వయస్సులో అంగస్తంభన లోపం సమస్యను పరిష్కరించకపోతే గుండెపోటుకు(Heart Attack) సంకేతం. మానసిక కారణాలు కూడా నపుంసకత్వానికి దారితీస్తుంది. వృద్ధులలో కంటే యువకులలో ఇది చాలా సాధారణం. అంగస్తంభన పనితీరు వయస్సుతో మారే శారీరక వ్యవస్థలతో ప్రభావితమవుతుంది. వయస్సు పెరగడం అనేది పురుషుల లైంగిక పనితీరులో ముఖ్యమైన హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్తో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే బలహీనమైన రక్త ప్రసరణ, లైంగిక పనితీరు మీద ప్రభావితం చేస్తుంది.

అంగస్తంభన కారణాన్ని గుర్తించడం సమర్థవంతమైన చికిత్సకు మొదటి అడుగు. ఈ ప్రక్రియలో వైద్య నిపుణులు మీకు సహాయం చేయగలరు. అనేక మానసిక సమస్యలు దీనికి ప్రధాన కారణం కావొచ్చు. జీవితంలో ఒత్తిళ్లు లేదా సంఘటనలు, హస్తప్రయోగం వలన కొన్ని సమస్యలు, మానసికంగా కుంగిపోవడం లాంటి వాటితో అంగస్తంభన సమస్యలు వస్తాయి. తీసుకునే ఆహారం కూడా సరిగా ఉండాలి. అంగానికి రక్తప్రసరణ సరిగా లేకపోతే.. అంగస్తంభన లోపం రావొచ్చు. లిబిడో తక్కువగా ఉన్నా... అంగస్తంభనను పొందడంలో ఇబ్బంది ఉండవచ్చు.

సంబంధిత కథనం