మెట్రో స్టేషన్‌లో లైంగిక వేధింపులు.. పురుషాంగం చూపిస్తూ వెకిలి చర్యలు-woman alleges sexual assault in delhi metro dmrc seek details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Woman Alleges Sexual Assault In Delhi Metro, Dmrc Seek Details

మెట్రో స్టేషన్‌లో లైంగిక వేధింపులు.. పురుషాంగం చూపిస్తూ వెకిలి చర్యలు

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 02:55 PM IST

న్యూఢిల్లీ, జూన్ 3: తాను మెట్రో స్టేషన్‌లో తోటి ప్రయాణికుడి ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ యువతి సామాజిక మాధ్యమం ట్విటర్‌లో పోస్టు చేసింది. జోర్ బాగ్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగిందని సవివరంగా ట్వీట్ చేశారు.

ఢిల్లీ మెట్రో
ఢిల్లీ మెట్రో (HT_PRINT)

ఓ చిరునామాకు సంబంధించి దిక్కులు అడిగే నెపంతో స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉన్న తన వద్దకు వచ్చి లైంగికంగా వేధించిన తీరును యువతి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

‘నేను సాధారణంగా ట్వీట్ చేయను. కానీ ఢిల్లీ మెట్రోలో ఓ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా సుదీర్ఘమైన పోస్ట్.. ఓపిగ్గా చదవండి. ఈరోజు ఎల్లో లైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. జోర్ బాగ్ మెట్రో స్టేషనల్‌లో ఈ ఘటన జరిగింది..’ అంటూ అద్వైత కపూర్ ట్వీట్ చేశారు.

‘మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి ఓ అడ్రస్ చెప్పాలని నా సాయం కోరాడు. నేను ఆ వివరాలు చెప్పాను. స్టేషన్ వచ్చాక దిగి క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్నా. అదే వ్యక్తి నా దగ్గరికి మళ్లీ వచ్చాడు. అడ్రస్ కన్ఫర్మ్ చేసుకునేందుకు వచ్చినట్టుగా నమ్మిస్తూ సాయం కోసం వచ్చినట్టుగా నటించాడు.

‘నాకు చూపిస్తున్నట్టుగా కనిపించిన ఓ ఫైల్‌‌ను చూశాను. ఆ సమయంలో అతడు తన బహిర్గతం చేసి ఉన్న పురుషాంగాన్ని నా ముఖంలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. అలా మూడు సార్లు ప్రయత్నించాడు. నేను గమనించగానే వెంటనే లేచి పరుగెత్తాను. ఎందుకంటే నేను చాలా భయపడిపోయాను. ఏమీ ఆలోచించలేకపోయాను.. దగ్గరలో ఉన్న ఓ అధికారి వద్దకు పరుగెత్తి విషయం చెప్పినా అతడు పట్టించుకోలేదు. తానేమీ చేయలేనన్నాడు. పోలీసు అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించాడు.. ’ అని వివరించారు.

‘ఆ అధికారి ప్లాట్‌ఫామ్‌పై నిలుచిని ఉన్నాడు. కానీ నాకు సాయం చేసేందుకు నిరాకరించాడు. పైకి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించాడు. అప్పటికీ ఇంకా భయపడుతూనే ఉన్నాను. పైకి వెళ్లి అక్కడ పోలీసు అధికారిని కలిశాను. సీసీటీవీ రూమ్‌కు తీసుకెళితే తనను వేధించినవాడిని గుర్తుపడతానని పోలీసులకు చెప్పాను. వాళ్లు నన్ను తీసుకెళ్లారు..’ అని యువతి వివరించారు.

తాను అతడిని గుర్తు పట్టానని, కానీ అప్పటికే అతడు వేరే మెట్రో ఎక్కి పారిపోయాడని వివరించారు.

‘నేను అతడిని గుర్తు పట్టాను. మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అతడు వేరే మెట్రో ఎక్కి పారిపోతుండగా మేం చూశాం. ఏదైనా చేయాలని నేను కోరగా.. చేయకపోగా నన్ను బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. ఒక సీన్ క్రియేట్ చేసి ఉండాల్సిందని, కానీ అక్కడేం జరగలేదని అన్నారు..’ అని ఆమె వివరించారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ వివరాలను పరిశీలించి సంఘటన ఎప్పుడు జరిగిందో చెప్పాలంటూ ఆమెను కోరారు.

‘హాయ్.. ఘటన జరిగిన సరైన సమయం చెప్పండి. ఇలాంటి కేసుల్లో ప్రయాణికులు తక్షణం సమీపంలో ఉన్న మెట్రో సిబ్బందికి రిపోర్ట్ చేయాలని లేదా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేయాలని ప్రయాణికులను కోరుతున్నాం.. ’ అంటూ డీఎంఆర్సీ ట్వీట్ చేసింది.

ఈ యువతి చేసిన ట్వీట్‌ను దాదాపు మూడు వేల మంది రీ ట్వీట్ చేశారు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం తనను పోలీసులు సంప్రదించారని, రాతపూర్వక ఫిర్యాదు తీసుకున్నారని మరో ట్వీట్ చేసింది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

IPL_Entry_Point

టాపిక్