Summer Foods : వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు-take these 5 foods for good health in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Take These 5 Foods For Good Health In Summer

Summer Foods : వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 09:26 AM IST

Health In Summer : ఎండాలు గట్టిగా కొడుతున్నాయి. బయటకు వెళ్తే.. కాసేపటికే అలసిపోతున్నారు. వేసవి వేడి గుండెల్లో మంటను కలిగిస్తుంది. కాబట్టి మీ డైలీ డైట్‌లో పొట్ట చల్లగా ఉంచేందుకు ఫుడ్స్ ఉండటం చాలా ముఖ్యం.

సమ్మర్ ఫుడ్
సమ్మర్ ఫుడ్

ఈ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీర(Body) శక్తి స్థాయిలు పడిపోతున్నాయి. మీ శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే అధిక వేడి మిమ్మల్ని డీహైడ్రేట్(dehydrate) చేస్తుంది. కాబట్టి పుష్కలంగా నీరు తాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు కడుపుని చల్లబరిచేందుకు పండ్లు(Fruits), కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం కూడా ముఖ్యం. ఈ పానీయాలను రోజువారీ భోజనంలో తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే సీజన్‌ను బట్టి ఆహారం మార్చుకోవాలి. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి.

పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు(Curd) మాత్రమే కాదు, పాలు, చీజ్ మొదలైన పాల ఉత్పత్తులలో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. వేసవి రోజుల్లో కడుపు చల్లగా ఉండాలంటే రోజుకు ఒక్కసారైనా పెరుగు లేదా మజ్జిగ తీసుకోండి. లేదంటే పెరుగు బజ్జీ లేదా పెరుగు బేస్డ్ స్మూతీస్ తయారు చేసి తాగవచ్చు.

వేసవి(Summer)లో పండ్ల మార్కెట్లలో పుచ్చకాయలు తరచుగా కనిపిస్తాయి. ఈ జ్యూసి ఫ్రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో తినడానికి ఇది ఉత్తమమైన పండు. చల్లగా ఉండటానికి ఈ పండును తినండి. ఈ వేసవిలో తాగడానికి మీరు పుచ్చకాయ రసం లేదా పుచ్చకాయ(watermelon) స్మూతీని కూడా తయారు చేసుకోవచ్చు.

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది కరిగే, కరగని ఫైబర్(Fiber) రెండింటినీ కలిగి ఉన్నందున ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్ లో జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటుంది. కాబట్టి ఓట్ తో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి రోజంతా నీరు ఎక్కువగా తాగి అలసిపోయారా? నో ప్రాబ్లమ్. ఇంట్లోనే కొన్ని రకాల రసాలను తయారు చేసుకోండి. నీటితోపాటుగా రుచికరమైన హెర్బల్ డ్రింక్(Herbal Drink) తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. పుదీనా, నిమ్మ వంటి మూలికల్లో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఒక జాడీలో నీళ్ళు నింపి దానికి పుదీనా ఆకులు, నిమ్మరసం కలపండి. ఇందులో మీకు నచ్చిన పండ్లను కూడా జోడించవచ్చు. బాగా మిక్స్ చేసి కొంత సమయం తర్వాత తాగాలి.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు దోసకాయ ఉత్తమమైన ఆహారం. సాదాసీదాగా తినడానికి ఇష్టపడని వారు దోసకాయల సలాడ్ చేసి తినవచ్చు.

WhatsApp channel