తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Regrow Hair Naturally । జుట్టు సహజంగా, ఆరోగ్యంగా పెరగటానికి ఈ 6 చాలు!

Regrow Hair Naturally । జుట్టు సహజంగా, ఆరోగ్యంగా పెరగటానికి ఈ 6 చాలు!

HT Telugu Desk HT Telugu

09 June 2023, 8:00 IST

    • Regrow Hair Naturally: సహజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే పద్ధతులు, హెయిర్ ఆయిల్స్, అలాగే జుట్టు సంరక్షణకు (Hair Care) ఇంకా ప్రభావవంతమైన సహజ ఉత్పత్తులు మొదలైన వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
Regrow Hair Naturally
Regrow Hair Naturally (shutterstock)

Regrow Hair Naturally

Regrow Hair Naturally: జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇందులో జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత, చుండ్రు (Dandruff) సమస్య, ఒత్తిడి ఆందోళనలు, స్వయం ప్రతిరక్షక వ్యాధులు, పోషకాహార లోపాలు వంటిని జుట్టుపై ప్రభావం చూపుతాయి. కానీ మీ జుట్టును సహజంగా తిరిగి పెరిగేలా చేయడానికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. జుట్టు రాలడం అరికట్టడానికి, కొత్త జుట్టు పెరుగుదలకు ఇతర జుట్టు సమస్యలన్నింటికీ ఇంటి వద్దే పరిష్కారాలు లభిస్తాయి. రోజ్మేరీ నూనెతో తలకు మసాజ్ (Oil Massage) చేయటం, సహజ సిద్ధమైన ఉత్పత్తులను తలకు పట్టించడం వంటి కొన్ని పద్దతులు జుట్టు ఆరోగ్యానికి, వాటి పెరుగుదలకు ప్రయోజనం చేకూరుస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

సహజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే పద్ధతులు, హెయిర్ ఆయిల్స్, అలాగే జుట్టు సంరక్షణకు (Hair Care) ఇంకా ప్రభావవంతమైన సహజ ఉత్పత్తులు మొదలైన వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

1. తలకు మసాజ్

జుట్టుకు నూనెను పెట్టుకోవడం మాత్రమే కాదు, సున్నితంగా మసాజ్ చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి. హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్‌లతో కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా పోషకాలు అంది జుట్టు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ చేతి మునివేళ్లతో మీ తలపై మసాజ్ చేయండి. కొద్దిగా ప్రెజర్ అప్లై చేస్తూ వృత్తాకారంగా మసాజ్ చేయండి. 24 వారాల పాటు ప్రతిరోజూ 4 నిమిషాల పాటు తలకు ఈ విధంగా మసాజ్ చేసుకోవడం ద్వారా జుట్టు దట్టంగా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

2. కలబంద

అలోవెరాను (Aloe vera for Hair regrowth) జుట్టు రాలడంను తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద స్కాల్ప్, హెయిర్‌ను శాంతపరుస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది, అదనపు నూనె ద్వారా నిరోధించే జుట్టు కుదుళ్లను అన్‌బ్లాక్ చేస్తుంది. స్వచ్ఛమైన కలబంద జెల్‌ను మీ తలకు , జుట్టుకు వారానికి కొన్ని సార్లు అప్లై చేయాలి. మీరు కలబంద సారంను కలిగి ఉన్న షాంపూ, కండీషనర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

3. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో (Coconut oil for Hair regrowth లారిక్ యాసిడ్ అని పిలిచే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి జుట్టు షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోతాయి, జుట్టు నుండి ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తాయి. మీ జుట్టు రకాన్ని బట్టి మీ జుట్టును కడగడానికి ముందు లేదా హెయిర్ వాష్ చేసిన తర్వాత కొబ్బరి నూనెను ఉపయోగించాలి. కొబ్బరి నూనెను మీ తలకు, మీ జుట్టు మొత్తానికి మసాజ్ చేయండి. మీ జుట్టు జిడ్డుగా ఉన్నట్లయితే, ముందుగా జుట్టును శుభ్రపరిచి, రాత్రిపూట లేదా కొన్ని గంటల పాటు ఆలాగే ఉంచి ఉదయం కడిగేసుకోవాలి.

4. ఫిష్ ఆయిల్

ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మీ జుట్టు లోపలి నుండి మెరుగుపడుతుంది, ఎందుకంటే అవి పోషకాలు, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఒమేగా సప్లిమెంట్ తీసుకోవడం వల్ల జుట్టు సాంద్రత, వ్యాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ఒమేగా కొవ్వు ఆమ్లాలు మీ కణాలు సరిగ్గా పని చేయడంలో సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఫిష్ ఆయిల్ (Fish Oil for Hair regrowth) సప్లిమెంట్ల రూపంలో దొరుగుతుంది. నిపుణులను సంప్రదించి సరైన డోస్ తీసుకోవాలి.

5. రోజ్మేరీ నూనె

రోజ్మేరీ అనేది జుట్టు పెరుగుదలను (Rosemary oil for Hair regrowth) ప్రోత్సహించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగించే ఒక ఎసెన్షియల్ ఆయిల్. రోజ్మేరీ ఆయిల్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి, ఆండ్రోజెనెటిక్ అలోపేసియా చికిత్సకు కూడా ఉపయోగించవచ్చు. ఆర్గాన్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్‌లో కొన్ని చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ను మిక్స్ చేసి, మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. ఆపై నీటితో శుభ్రపరుచుకోండి. ఇలా వారానికి కొన్ని సార్లు చేయండి. మీరు ప్రతిరోజూ మీ షాంపూ మరియు కండీషనర్‌లో కొన్ని చుక్కల రోజ్మేరీ నూనెను కూడా కలుపుకోవచ్చు.

6. ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం మీ జుట్టు పెరుగుదలకు (Onion Juice for Hair regrowth) ఎంతో విలువైనది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మేలనది. ఉల్లిరసంలో హెయిర్ ఫోలికల్ ఎదుగుదలకి అవసరమయ్యే కెరాటినోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్‌ను మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసాన్ని మీ తలకు, జుట్టుకు అప్లై చేసి, కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆపై షాంపూతో కడిగేసుకోండి.