తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Red Onion For Hairs : జుట్టు రాలకుండా ఉండాలా? అయితే ఇలా చేయండి

Red Onion For Hairs : జుట్టు రాలకుండా ఉండాలా? అయితే ఇలా చేయండి

Anand Sai HT Telugu

29 May 2023, 14:04 IST

    • Red Onion For Hairs : ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా విధాలుగా ఉపయోగపడుతాయి. అయితే ఎర్ర ఉల్లిని ఉపయోగిస్తే మేలు ఎక్కువగా జరుగుతుంది.
జుట్టుకు ఉల్లి రసం
జుట్టుకు ఉల్లి రసం

జుట్టుకు ఉల్లి రసం

మీరు జుట్టు రాలడానికి బెస్ట్ హోం రెమెడీ(Home Remedy) కోసం చూస్తున్నట్లయితే, రెడ్ ఆనియన్(Red Onion)ను ఎంచుకోండి. జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ చాలా మంచిది. జుట్టు రాలడాన్ని(Hair Loss) నివారించడంలో కూడా సహాయపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, థైరాయిడ్, ఒత్తిడి, మారిన జీవన విధానం, కాలుష్యం లాంటి కారణాలతో జుట్టు సమస్యలు(hair problems) వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ఇందుకోసం ఎర్ర ఉల్లి బాగా ఉపయోగపడుతుంది.

ఎర్ర ఉల్లి రసం ఎవరికి మంచిది? అలోపేసియా చికిత్స పొందుతున్నట్లయితే, తలపై మంట మరియు దురద, అధిక జుట్టు రాలడం, చాలా పలచబడిన జుట్టు, జుట్టు చిట్లిపోవడం, అకాల బట్టతల, తలలో ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్ర ఉల్లి రసం ఉపయోగించొచ్చు.

ఎర్ర ఉల్లి జ్యూస్(Red Onion Juice) ఉపయోగిస్తే, మంచి పరిష్కారం లభిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో మరియు జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం వల్ల మీ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఉల్లిపాయ రసం కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రీయంగా నిరూపించబడింది. మీకు బట్టతల సమస్య ఉంటే, మీరు జుట్టు రాలడాన్ని ఉల్లిపాయ రసంతో వదిలించుకోలేరు. కానీ జుట్టు రాలుతున్నప్పుడు(Hair Loss) ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే, జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించే ముందు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మీకు ఉల్లిపాయలు అలెర్జీ అయితే ఉపయోగించవద్దు. ఉల్లిపాయ వాసన మీకు నచ్చకపోతే, దాని ఘాటైన వాసన మీకు చికాకు కలిగించవచ్చు. అందుకే మీకు ఉల్లిపాయ రసం పడితేనే వాడండి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి.

ఎలా ఉపయోగించాలి

ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనె(Coconut Oil)తో కలిపి కూడా మీ కుదుళ్లకు అప్లై చేయోచ్చు. ముల్తానీ మట్టితో కూడా కలిపి ఉపయోగించొచ్చు. ఉల్లిపాయ రసం అప్లై చేసిన అరగంట తర్వాత తేలికపాటి షాంపూ వేసి కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే 2-3 నెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

అనేక కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. కొందరికి మానసిక ఒత్తిడి(Mental Stress) వల్ల వస్తుంది. వాయు కాలుష్యం, పౌష్టికాహారం లేకపోవడం, హార్మోన్లలో మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు(Health Problems), జుట్టు సంరక్షణ పట్ల శ్రద్ధ లేకపోవడం మొదలైనవి జుట్టు సమస్యలకు కారణమవుతాయి. ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

తదుపరి వ్యాసం