Skin & Hair Care । మీరు అందమైన జుట్టును, మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!-plant protein makes magic for your skin and hair know benefits
Telugu News  /  Lifestyle  /  Plant Protein Makes Magic For Your Skin And Hair, Know Benefits:
Plant Protein for Skin and Hair
Plant Protein for Skin and Hair (unsplash)

Skin & Hair Care । మీరు అందమైన జుట్టును, మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!

25 May 2023, 17:43 ISTHT Telugu Desk
25 May 2023, 17:43 IST

Plant Protein for Skin and Hair: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని పొందడానికి రోజూవారీగా తగినంత ప్రోటీన్ తినడం చాలా ముఖ్యం. శాకాహార ప్రోటీన్లు అధికంగా తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు అంటున్నారు.

Plant Protein for Skin and Hair: మన శరీరంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే భాగాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి మన చర్మం, జుట్టు అనే చెప్పవచ్చు. అందమైన జుట్టు కోసం, మెరిసే చర్మం కోసం చాలా మంది చాలా రకాల సంరక్షణ చర్యలు తీసుకుంటారు. కఠినమైన సూర్య కిరణాలు, తేమ, నిర్జలీకరణం, అనేక ఇతర కారణాల వల్ల, మన చర్మం మరియు జుట్టు గరుకుగా, పొలుసులుగా మారతాయి. కాబట్టి వీటిని సంరక్షించడానికి సరైన పోషణ అవసరం. ప్రధానంగా ప్రోటీన్ పోషణ అందించాలని నిపుణులు అంటున్నారు. శరీరంలో ప్రోటీన్ తగినంత స్థాయిలో ఉంటే అది చర్మం, జుట్టుపై అద్భుత ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని పొందడానికి రోజూవారీగా తగినంత ప్రోటీన్ తినడం చాలా ముఖ్యం. అందులోనూ మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

శాకాహార ప్రోటీన్లు అధికంగా తీసుకుంటే అది మీ చర్మం, జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం- జుట్టును మృదువుగా చేస్తుంది

కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా చర్మం పొడిగా మారుతుంది, ముడతలు ఏర్పడుతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్ మన చర్మం, జుట్టును మృదువుగా చేయడంలో సహాయపడుతుంది, ఇది అవసరమైన తేమను అందిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇదేకాకుండా ఒమేగా 3s వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు అవసరం. ఇవి రక్షణ , ఆర్ద్రీకరణను అందించడం జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

జుట్టు పెరుగుదలకు

మొక్కల ఆధారిత ప్రోటీన్లు జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి, ప్రతీ ఒక్క వెంట్రుకను బలపరుస్తాయి. మీ జుట్టును ఆరోగ్యంగా నిర్వహించగలిగేలా చేస్తాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్ జుట్టుకు తక్షణ ఫలితాలను అందిస్తుంది. చిట్లిన, పొడి జుట్టుకు పోషణను అందిస్తుంది.

స్కిన్ రిపేరింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది

మొక్కల ఆధారిత ప్రోటీన్ చర్మం బలమైన నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఇది చర్మానికి ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన కాంతిని అందించడంలో సహాయపడుతుంది. ప్రొటీన్లు , అమైనో ఆమ్లాలు సెల్ టర్నోవర్‌ను పెంచడంలో సహాయపడతాయి, అంటే పాత చర్మ కణాలను తగ్గించడం ద్వారా కొత్త వాటికి అవకాశం కల్పించడం.

హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం

మొక్కల ఆధారిత ప్రోటీన్ జుట్టు, చర్మానికి హానికరమైన ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షణను అందిస్తుంది. ఇది మిమ్మల్ని నల్ల మచ్చలు, ముడతలు, పొడి జుట్టు , పొలుసుల స్కాల్ప్ నుండి దూరంగా ఉంచుతుంది.

సంబంధిత కథనం