Onion Facts: ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అని అందరికీ తెలిసిందే. ఈ వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని సూచిస్తారు. చలువ గుణాలు (Cooling Properties) కలిగిన ఉల్లిపాయను తినడం ద్వారా ఎండవేడి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. హీట్ స్ట్రోక్ తగలకుండా మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు ఉల్లిపాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి. వివిధ రకాల సమస్యలకు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఉల్లిపాయలతో కొన్ని ప్రయోజనాలతో పాటు, మరికొన్ని దుష్ప్రభాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అతిగా పచ్చి ఉల్లిపాయలను (Raw Onions) తినడం కొన్నిసార్లు అనారోగ్యకరం కావచ్చు. ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది, ఇది కడుపు సమస్యలను (Stomach Upset) కలిగిస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
ఉల్లిపాయ తీసుకోవడం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
గుండెకు మంచిది: ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్, థియో సల్ఫైట్స్ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా రక్త ప్రసరణను నియంత్రించడం ద్వారా ఇది గుండెపోటు,స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
క్యాన్సర్ నుంచి రక్షణ: పచ్చి ఉల్లిపాయ క్యాన్సర్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ మూలకం క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఎముకల దృఢత్వానికి: ఉల్లిపాయల్లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దంతాల, ఎముకల నిర్మాణానికి ఇది అవసరం. ఉల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. .
జుట్టుకు మేలు చేస్తుంది: ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టు బలంగా పెరగడానికి, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, మెరిసేలా, వేగంగా పెరగడంతోపాటు రక్తప్రసరణ పెరిగి శిరోజాలకు బలం చేకూరుతుంది. ఉల్లిపాయ నూనె DIY Onion Oil జుట్టు సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభాలు ఇలా ఉన్నాయి.
ఉల్లిపాయ తినడం మంచిదే. అయితే ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ ఏదైనా పరిమితిలో తీసుకుంటేనే అమృతం, ఎక్కువైతే విషం అని గ్రహించాలి. ఉల్లిపాయల విషయంలోనూ అంతే.
సంబంధిత కథనం